విధాత: ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ అంటే అందరూ అది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాగా భావిస్తారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన మూవీగా దీన్ని అనుకుంటారు. కానీ ఆర్ ఆర్ ఆర్ అనే వ్యక్తి రాజకీయాల్లో కూడా ఉన్నాడు. ఆయన మరెవరో కాదు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ముద్దుగా ఆర్ఆర్ఆర్ అని పిలుస్తారు. కాగా ఈయన తాజాగా చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆయన […]

విధాత: ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ అంటే అందరూ అది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాగా భావిస్తారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన మూవీగా దీన్ని అనుకుంటారు. కానీ ఆర్ ఆర్ ఆర్ అనే వ్యక్తి రాజకీయాల్లో కూడా ఉన్నాడు. ఆయన మరెవరో కాదు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ముద్దుగా ఆర్ఆర్ఆర్ అని పిలుస్తారు. కాగా ఈయన తాజాగా చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆయన ఓ ట్వీట్‌ చేశారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13న, బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి ఒకరోజు ముందుగా అంటే జనవరి 12న విడుద‌ల కానున్నాయి.

ఈ సందర్భంగా ర‌ఘు రామకృష్ణంరాజు ట్వీట్ చేస్తూ చిరంజీవిని జనసేన కింద చూడడం, బాలకృష్ణ ఎలాగూ టిడిపి ఎం.ఎల్‌.ఎ. కావడంతో.. ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి వీరిద్దరూ ప్రస్తుతం ప్రత్యర్థులే. ఇప్పటికే బాలకృష్ణ, పవన్‌పై వైసీపీ నాయకులు విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ రెండు చిత్రాలు హిట్ అవ్వాలి.. మా పార్టీకి చెందినవారు వేరే పేర్లతో తప్పుడు రివ్యూలు రాస్తారు. ఒకరి ఫ్యాన్స్‌గా చెప్పుకుంటూ మరొకరిపై విమర్శలు గుప్పిస్తారు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అప్రమత్తంగా ఉండాలి అని ట్విట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇప్పటికే దిల్ రాజు వల్ల చిరు, బాలయ్య ఫ్యాన్స్ ఒకటై థియేటర్స్ కోసం పోరాడుతున్నారు. తాజాగా ఎంపీ రఘురామకృష్ణం రాజు చేసిన ఈ ట్వీట్ తో మరోసారి చిరు, బాలయ్య ఫ్యాన్స్ ఒకటై నిజమే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇందులో రఘు రామ కృష్ణంరాజు చెప్పిన పాయింట్ కూడా ఎంతో విలువైనదిగా భావించాలి. వైసీపీ శ్రేణులు ఇటీవల చంద్రబాబు నాయుడు సభలలో కూడా ప్రవేశించి తొక్కిసలాటకు కారణమై పలువురి మరణాలకు కారణమయ్యారు అనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఆల్రెడీ వైసీపీ నేతలు జనవరి ఒకటికి ముందే కొత్త ఏడాదితో తమ రాజకీయ ఎత్తుగడ, వ్యూహాలు మారుతాయని ప్రకటించారు. అవి ఇలాంటి పనులు చేయడమేనా అని రఘు రామకృష్ణంరాజు ఇప్పటికే ఇన్ డైరెక్ట్ గా వైసీపీ నేతలను కడిగిపారేస్తున్నారు. ఈ తొక్కిస‌లాట‌లు, జ‌నాల మ‌ర‌ణాలు మానవ ప్రేరేపితమే గాని యాదృచ్ఛికంగా మాత్రం కాదంటున్నారు రఘురామకృష్ణంరాజు. చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట జరిగి మరణాలు సంభవించడం అనేది కొందరు పన్నిన కుట్ర అని, అది యాదృచ్ఛికం కాదని కొందరు కావాలని పనిగట్టుకొని ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు.

తాజాగా ఆయన చిరు బాలయ్య ఫ్యాన్స్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ కూడా ముందు జాగ్రత్తగా చేసిందేనని భావించాలి. దీనితో అందరూ అప్రమత్తమవుతున్నారు. చిరు, బాలయ్య ఫ్యాన్స్ కూడా ఒకటై తమ మధ్య గొడవలు లేకుండా చూసుకోవాలని అంటున్నారు. గతంలో చిరంజీవి ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వివాదాలు సృష్టించాడని, దాని వలన పెద్ద ఎత్తున గొడవలు జరిగాయని కొందరు ఆరోపిస్తున్నారు. అదే తరహాలో ఈసారి చిరంజీవి, బాలయ్య మధ్య సినిమాల పరంగా ఉన్నా విభేదాలను తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ.. వైసీపీ నేతలు ఎంత దారుణాల కైనా ఒడి కట్టేందుకు వెనుకాడరని రఘురామకృష్ణం రాజు తో పాటు పలువురు ముందుగా హెచ్చరిస్తున్నారు.

Updated On 12 Jan 2023 1:46 AM GMT
krs

krs

Next Story