విధాత‌: ఒక్కప్పటిలా బాలయ్య, చిరు ఫ్యాన్స్ మధ్య ఈసారి మరి వీర స్థాయిలో తిట్టి కొట్టుకునేంత పరిస్థితి లేదు. వారు నటించిన వాల్తేరు వీరయ్య, వీర నరసింహారెడ్డి పక్కపక్క రోజునే విడుదలవుతున్నప్పటికీ వారు పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. దిల్ రాజు తమ‌ హీరోలకు థియేటర్లు కేటాయించకపోవడంపై ఇద్దరి హీరోల అభిమానులు ఒకటై దిల్‌రాజుపై ఒత్తిడి తెచ్చేలా చేశారు. అలాగని చిరు, బాలయ్యల మధ్య కోల్డ్ వార్ ముగిసిందని అనుకోవడానికి లేదని కొందరంటున్నారు. దానికి ఉదాహరణగా వారు కొన్ని […]

విధాత‌: ఒక్కప్పటిలా బాలయ్య, చిరు ఫ్యాన్స్ మధ్య ఈసారి మరి వీర స్థాయిలో తిట్టి కొట్టుకునేంత పరిస్థితి లేదు. వారు నటించిన వాల్తేరు వీరయ్య, వీర నరసింహారెడ్డి పక్కపక్క రోజునే విడుదలవుతున్నప్పటికీ వారు పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. దిల్ రాజు తమ‌ హీరోలకు థియేటర్లు కేటాయించకపోవడంపై ఇద్దరి హీరోల అభిమానులు ఒకటై దిల్‌రాజుపై ఒత్తిడి తెచ్చేలా చేశారు.

అలాగని చిరు, బాలయ్యల మధ్య కోల్డ్ వార్ ముగిసిందని అనుకోవడానికి లేదని కొందరంటున్నారు. దానికి ఉదాహరణగా వారు కొన్ని విషయాలను ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి వీరసింహారెడ్డిని డిసెంబర్ లోనే విడుదల చేయాలనుకున్నారట. 2021లో డిసెంబర్ లోనే అఖండ వచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఈసారి కూడా వీరసింహారెడ్డిని ఇటీవల ముగిసిన డిసెంబర్లో విడుదల చేయాలని భావించిన ప్పటికీ బాలయ్య ఒత్తిడి వల్లనే ఈ చిత్రం సంక్రాంతికి పోస్టుపోనైంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

మైత్రి మూవీస్ మేకర్స్ వారు వీరసింహారెడ్డిని డిసెంబర్లో, వాల్తేరు వీరయ్యను సంక్రాంతికి విడుదల చేయాలని ముందుగా భావించారట. కానీ చిరు సంక్రాంతికి వ‌స్తుండడంతో తన సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని తద్వారా చిరుతో పోటీ పడాలని బాలయ్య భావించాడని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.

మరోవైపు వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఆరో తారీఖున ఒంగోలులో జరిగింది. అంత దూరం శృతిహాసన్ ఎన్నో వ్య‌య‌ ప్రయాసలు పడి మరి అక్కడ వేడుకలో పాల్గొని తనదైన స్పీచ్ తో అలరించింది. మరి అంత దూరం వెళ్లిన ఆమె హైదరాబాదులో ఉన్నప్పటికీ వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రం హాజరు కాలేదు. దానికి కారణం జ్వరమని అంటున్నారు.

కానీ మరికొందరు మాత్రం బాలయ్య ఒత్తిడి చేసి మరి శృతిహాసన్ ను వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ కాకుండా చేశాడని వాదనను వారు వినిపిస్తున్నారు. కానీ వాల్తేరు వీరయ్యకు డుమ్మా కొట్టేసిన శృతిహాసన్ తాజాగా అన్ స్టాప‌బుల్ షోకి మాత్రం ముఖ్య అతిథిగా పాల్గొంది. దాంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.

మరోవైపు చిరంజీవి వాల్తేరు వీరయ్య వేడుకలో బాలయ్య నటించిన వీర సింహారెడ్డి కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కానీ బాలకృష్ణ మాత్రం తన వీరసింహారెడ్డి వేడుకలో వాల్తేరు వీరయ్య గురించి అసలు ప్రస్తావనే తేలేదు. దాంతో చిరు-బాలయ్యల మధ్య కోల్డ్‌వార్ ఇంకా అలాగే ఉందని కొందరు అంటున్నారు.

ఇక చిరంజీవి సరదాగా వాల్తేరు వీరయ్య వేదికపై శృతిహాసన్ ఒంగోలులో ఏమి తిన్నదో ? ఎవరు బెదిరించారో? తెలియదు ఈ ఫంక్షన్‌కి రాలేకపోయింది అని సరదాగా అన్నారు. కానీ దీని వెనుక చాలా అంతరార్థం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు..!

Updated On 13 Jan 2023 4:41 PM GMT
krs

krs

Next Story