Friday, December 9, 2022
More
  Homehealthకొలెస్ట్రాల్.. కంగారు పడాల్సిందేమీ లేదు.. ఎందుకంటే!

  కొలెస్ట్రాల్.. కంగారు పడాల్సిందేమీ లేదు.. ఎందుకంటే!

  ఆరోగ్య విధాత: కొలెస్ట్రాల్ స్థాయిల చికిత్స పేరుతో ఇప్పటికే కోట్ల కొద్ది డబ్బు దండుకుంది ఫార్మా ఇండస్ట్రీ. ఇది నిజంగా వైద్య రంగం, పాలకుల అసమర్థతకు నిదర్శనం. దాదాపు రెండు ట్రిలియన్ డాలర్ల డబ్బు ఇప్పటివరకు కొలెస్ట్రాల్ చికిత్సలో ప్రజలు ఖర్చు చేశారు. ఇది కేవలం ఒక అమెరికా గణాంకాలు మాత్రమే. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇంకెంత డబ్బు ఖర్చు జరిగిందో ఊహించడం కూడా కష్టమే.

  కొలెస్ట్రాల్ అనే మాటను చివరికి వైద్య చికిత్స నుంచి తొలగించడం జరిగింది. చివరకు తేల్చిన విషయం ఏంటంటే కొలెస్ట్రాల్ అనే మాట పెద్దగా ఆందోళన పడాల్సిన విషయం కాదు. దాదాపు 70వ దశకం నుంచి కూడా గుండె జబ్బులు, రక్తనాళాల జబ్బుల పేరుతో కొలెస్ట్రాల్ పెంచే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ వచ్చారు వైద్య నిపుణులు. కానీ అదేది అక్కర్లేదని తేల్చేశారు.

  అంటే ఇక నుంచి గుడ్డు, వెన్న, కొవ్వు కలిగిన పాలు, పాల ఉత్పత్తులు, గింజలు, కొబ్బరినూనె, మాంసా హారం వంటివన్నీ కూడా ఎటువంటి అనుమానం లేకుండా తినవచ్చు. ఇక ఈ ఆహార పదార్థాలు తినడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.

  ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పరిశోధనల సమీక్షలు జరిపి మార్గదర్శకాలను విడుదల చేసే యునైటెడ్ స్టేట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2015లో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం అమెరికా పౌరులు రోజుకు 300 ఎంజీకి మించి కొలెస్ట్రాల్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవద్దు అనే సూచించింది. ఇప్పుడు ఇవే మార్గదర్శకాలను కొనసాగించకూడదని భావిస్తోంది.

  కొత్తగా జరిపిన పరిశోధనల ద్వారా అందిన ఫలితాలను బట్టి తీసుకునే ఆహారంలోని కొవ్వు వల్ల రక్తంలో కొవ్వు శాతం పెరిగిన దాఖలాలు లేవు అని తేల్చేశారు. ఈ పరిశోధనలు ఏహెచ్ఏ(అమెరికన్ హార్ట్ అసోసియేషన్) ఏసిసి (అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ) వారి ఆధ్వర్యంలో జరిగాయి.

  ఇక నుంచి వారు ప్రజలు తీసుకునే ఆహారంలో కొవ్వు గురించి కంటే కూడా తీపి అంటే షుగర్ ఇన్ టేక్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలని సూచిస్తున్నారు. అంటే కొవ్వు పదార్థాలు తీసుకోవడం కంటే కూడా నేరుగా తీసుకునే చక్కెరలు ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయని వారు అభిప్రాయ పడుతున్నారు.

  దీని గురించి యూఎస్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డా. స్టీవెన్ నిస్సన్ మాట్లాడుతూ ‘‘ దశాబ్ధాల నుంచి మనం సరైన ఆహార నియమాలను పాటించడం లేదని తేలిసోయింది. ఇప్పటికైనా మనం సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. కొత్త మార్గదర్శకాలు రూపొందించుకోవాల్సి ఉంది’’ అని అన్నారు.

  వాస్తవం ఏమిటంటే మన శరీరంలో అత్యధికంగా కొలెస్ట్రాల్ లివర్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇక మెదడు మొత్తం కొవ్వు అంటే కొలెస్ట్రాల్ తోనే తయారై ఉంటుంది. కొలెస్ట్రాల్ నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పని చెయ్యడానికి చాలా అవసరం. ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, కార్టికోస్టిరాయిడ్స్ వంటి స్టిరాయిడ్ హార్మోన్లు తయారు కావడానికి కావల్సిన మూల పదార్థం కొలెస్ట్రాలే.

  శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయంటే అది వారి లివర్ పనితీరు సమర్థవంతంగా ఉందనడానికి నిదర్శనం. కార్డియో వాస్క్యూలార్ డిసీజ్‌కి సంబందించిన పరిశోధనలు నిర్వహించిన ఫ్రేమింగ్హామ్ కి చెందిన డాక్టర్ జార్జ్ వి. మన్ అభిప్రాయం ప్రకారం సాచురేటేడ్ కొవ్వులు, కొలెస్ట్రాల్ కలిగిన ఆహారం కరోనరీ హార్ట్ డిసీజ్ కి కారణం కాదని చెబుతున్నారు.

  కొలెస్ట్రాల్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద అపోహ. ప్రపంచంలో ఇదొక అతి పెద్ద మెడికల్ స్కామ్. అసలు చెడు కొలెస్ట్రాల్ అనే మాట లేనే లేదు. కాబట్టి ఇక నుంచి కొలెస్ట్రాల్ స్థాయిలు మార్చుకునేందుకు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. అధ్యయనాలు నిర్థారించిన దాన్ని బట్టి కొలెస్ట్రాల్‌కు గుండె జబ్బులకు అసలు సంబంధమే లేదు. తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు హార్ట్ ఎటాక్‌ను ఏ రకంగానూ ఆపలేవు.
  ఎందుకంటే గుండె జబ్బుల బారిన పడిన వారిలో చాలా మందిలో కొలెస్ట్రాల్ స్థాయిలు అత్యంత సాధారణంగా ఉండడాన్ని పరిశోధకులు గమనించారు.

  ప్రతి రోజు జీవక్రియలు సజావుగా సాగడానికి మన శరీరానికి రోజుకు దాదాపు 950 ఏంజీ కొలెస్ట్రాల్ అవసరమవుతుంది. మన శరీరంలో ప్రధానంగా కొలెస్ట్రాల్ ఉత్పత్తి కర్మాగారం లివర్. కేవలం 15 శాతం మాత్రమే మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి కొలెస్ట్రాల్ చేరుతుంది.

  ఒకవేళ మనం కొవ్వులు తక్కువగా కలిగిన ఆహారం తీసుకుంటే శరీరానికి కావల్సిన 950 ఏంజీ కొలెస్ట్రాల్ స్థాయిని స్థిరంగా ఉంచడానికి లివర్ ఎక్కువ పనిచెయ్యాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి అంటే శరీరంలో లివర్ సమర్థవంతంగా ఫనిచేస్తుందని అర్థం. నిపుణుల అభిప్రాయం ప్రకారం హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్ అనేవి అసలు లేవు. కొలెస్ట్రాల్ వల్ల శరీరంలో ఎక్కడా కూడా బ్లాక్స్ ఏర్పడవు.
  కొలెస్ట్రాల్‌కు సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకునేందుకు కింది లింక్ క్లిక్ చేసి చూడవచ్చు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page