Tuesday, January 31, 2023
More
    Homelatestలాయర్‌పై దాడి చేసిన CIని సస్పెండ్ చేయాలి: న్యాయ‌వాదులు

    లాయర్‌పై దాడి చేసిన CIని సస్పెండ్ చేయాలి: న్యాయ‌వాదులు

    • విధులు బ‌హిష్క‌రించి నిర‌స‌న తెలిపిన న్యాయ‌వాదులు

    విధాత, వరంగల్: వరంగల్ కోర్టులో పనిచేసే ఇద్దరు న్యాయవాదులను అకారణంగా చితకబాదిన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. బాధితులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ కోర్టులో పనిచేసే లాయర్ కొత్తపల్లి రాజు, తోటి న్యాయవాది దూడ ప్రశాంత్‌తో కలిసి వరంగల్ సంరక్ష హాస్పిటల్ లో చికిత్సపొందుతున్న బంధువులను పరామర్శించారు.

    ఆ తర్వాత దారిలో ఉన్న కుర్షిద్ హోటల్‌లో భోజనం చేసి బైటికి వస్తున్న కొత్తపల్లి రాజుని వెనక నుండి సీఐ లాఠితో కొట్టారు. వెళ్తున్నామని చెప్పినా వినకుండా నాకే ఎదురు చెప్తావా అని కొట్టారు. న్యాయవాదినని చెప్పినా పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టి, బెదిరించి లెటర్ రాయించుకొని ఉదయం పంపించారు.

    ఈ నిరసన సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద్ మోహన్ మాట్లాడుతూ న్యాయవాదుల పైన దాడులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. న్యాయవాదుల పైన దాడి చేయడం హేయమైన చర్య, వెంటనే CI ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ అని చెప్పినప్పటికీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నిర్బంధించడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కనీస మానవ హక్కులను కాలరాయడమే అని న్యాయవాదులకే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు.

    అనంతరం వరంగల్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తికి కంప్లైంట్ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన న్యాయ మూర్తి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్‌, జూనియర్ మహిళ న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని అదాలత్ అమర వీరుల స్తూపం వద్ద మానవ హారం నిర్వహించి నిరసన తెలిపారు.

    కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్స్ దుస్స జనార్ధన్, బైరపాక జయకర్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్కుర్తి ఆనంద్ మోహన్, గుడిగంటి శ్రీనివాస్ గౌడ్ కోశాధికారి సుభాష్, ఈసీ మెంబర్స్ కొత్తపల్లి చిరంజీవి, అన్నపూర్ణ, దుగ్గి అచ్యుత్ కుమార్, కందుల శ్రీలత సీనియర్ న్యాయవాదులు ముద్దసాని సహోదరు రెడ్డి, విజయభాస్కరరావు, అల్లం నాగరాజు, వద్దిరాజు గణేష్, పెద్ద ఎత్తున మహిళా న్యాయవాదులు, జూనియర్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular