Lokesh విధాత: టీడీపీ యువనేత, మాజీ మంత్రి లోకేష్ కోసం ఏపీ సీఐడీ ఎదురు చూస్తోందా ? రా.. రమ్మని పిలుస్తున్నదా.. స్కిల్ స్కాంలో ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న చంద్రబాబును తమ కస్టడీకి ఇమ్మని అడుగుతున్న ఏపీ సీఐడీ ఇప్పుడు లోకేష్ ను సైతం అరెస్ట్ చేసేందుకు చూస్తోంది అంటున్నారు. వాస్తవానికి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని దేశానికి వెల్లడించే లక్ష్యంతో ఢిల్లీ వెళ్లిన లోకేష్ నాలుగు రోజులుగా అక్కడే ఉన్నారు. టీడీపీ ఎంపీలతో […]

Lokesh
విధాత: టీడీపీ యువనేత, మాజీ మంత్రి లోకేష్ కోసం ఏపీ సీఐడీ ఎదురు చూస్తోందా ? రా.. రమ్మని
పిలుస్తున్నదా.. స్కిల్ స్కాంలో ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న చంద్రబాబును తమ కస్టడీకి ఇమ్మని అడుగుతున్న ఏపీ సీఐడీ ఇప్పుడు లోకేష్ ను సైతం అరెస్ట్ చేసేందుకు చూస్తోంది అంటున్నారు.
వాస్తవానికి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని దేశానికి వెల్లడించే లక్ష్యంతో ఢిల్లీ వెళ్లిన లోకేష్ నాలుగు రోజులుగా అక్కడే ఉన్నారు. టీడీపీ ఎంపీలతో సమావేశమై ఈ అంశాన్ని లోక్ సభలో ప్రస్తావించాలని వారికి దిశా నిర్దేశం చేశారు.
జాతీయ మీడియాతో ఇంటర్వ్యూలు ఇచ్చి చంద్రబాబు అరెస్ట్ అంశానికి జాతీయ స్థాయి ప్రచారం వచ్చేలా చేశారు. ఆయన ఆంధ్రకు రాగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే లోకేష్ ను సైతం ఫైబర్ గ్రిడ్ స్కాం కేసులో అరెస్ట్ చేసేందుకు సీఐడీ సిద్ధంగా ఉందని అంటున్నారు. ఇక ఇటు చంద్రబాబు హై కోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ తో పాటు బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు విచారణకు రాబోతున్నాయి.
