Chandrababu విధాత‌: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాములో అరెస్ట్ అయి 14 రోజుల రిమాండ్ కోర్టు విధించగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా ఆయనకు ఖైదీ నంబర్ 7691 కేటాయించింది. ఇదిలా ఉండగా ఆయన్ను తమ కష్టడీకి ఇవ్వాలని ఇటు సీఐడీ, లేదు లేదు ఆయనకు బెయిల్ ఇవ్వాలని అయన తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా పిటిషన్లు వేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, ఇంకా […]

Chandrababu

విధాత‌: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాములో అరెస్ట్ అయి 14 రోజుల రిమాండ్ కోర్టు విధించగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా ఆయనకు ఖైదీ నంబర్ 7691 కేటాయించింది. ఇదిలా ఉండగా ఆయన్ను తమ కష్టడీకి ఇవ్వాలని ఇటు సీఐడీ, లేదు లేదు ఆయనకు బెయిల్ ఇవ్వాలని అయన తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా పిటిషన్లు వేశారు.

ఈ కేసులో ప్రమేయం ఉన్న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, ఇంకా మనోజ్ పార్థసాని విదేశాలకు పరారీ అయిన నేపథ్యంలో చంద్రబాబు నుంచితాము మరికొన్ని వివరాలు సేకరించాల్సి ఉందని, ఈ నేపథ్యంలో ఆయన్ను ఐదురోజుల కష్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టును కోరింది.

ఈ కేసులో తాము మరిన్ని వివరాలు రాబట్టాలని సీఐడీ భావిస్తోంది. ఇప్పటికే ఆయన్ను శనివారం రాత్రి సీఐడీ ఆఫీసులో విచారించగా చాలా విషయాలకు అయన లేదు.. తెలీదు.. గుర్తులేదు అనే సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక చంద్రబాబు అయన విచారణకు సహకరించడంలేదని ఆయనను కస్టడీకి ఇస్తే విస్తృతంగా విచారణ చేస్తామని సీఐడీ అంటోంది.

ఇదిలా ఉండగా చంద్రబాబుకు జైల్లో భద్రతా లేదని, ఆయన్ను ఒక ఇంట్లోనే నిర్బంధించాలని లూథ్రా కోరుతున్నారు. ఆయనకు బెయిల్ కోసం కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. బాబుకు రాజమండ్రి జైలులో ప్రత్యేక వసతి, ఇంటి నుంచి భోజనం తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా దానికి కోర్టు అంగీకరించింది. ఈరోజు లోకేష్, బ్రాహ్మణి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయన్ను కలుస్తారు.

Updated On 12 Sep 2023 5:46 AM GMT
somu

somu

Next Story