విధాత: సినిమా హీరోయిన్లు అంటే జనాలలో సదభిప్రాయం లేదు. చాలా చెడు అభిప్రాయం ఉంది. నాలుగైదు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారని. ఎవరితో పడితే వారితో రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారని. ఇక వెండితెరపై అందాల ఆరబోతకు మాత్రమే వాళ్ళు పరిమితం అని. డబ్బు కోసం వారు దేనికైనా తెగిస్తారని అంటూ ఉంటారు. అలాంటి వాళ్లే ఇండస్ట్రీలో నెగ్గుకు రాగలరు అని అందరూ అనే మాట. అది వాస్తవమే అయినప్పటికీ దీంతో కూడా కొందరు మినహాయింపు ఉంటారు. సౌత్‌లో […]

విధాత: సినిమా హీరోయిన్లు అంటే జనాలలో సదభిప్రాయం లేదు. చాలా చెడు అభిప్రాయం ఉంది. నాలుగైదు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారని. ఎవరితో పడితే వారితో రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారని. ఇక వెండితెరపై అందాల ఆరబోతకు మాత్రమే వాళ్ళు పరిమితం అని. డబ్బు కోసం వారు దేనికైనా తెగిస్తారని అంటూ ఉంటారు.
అలాంటి వాళ్లే ఇండస్ట్రీలో నెగ్గుకు రాగలరు అని అందరూ అనే మాట. అది వాస్తవమే అయినప్పటికీ దీంతో కూడా కొందరు మినహాయింపు ఉంటారు. సౌత్‌లో ఇప్పటి వరకు వచ్చిన హీరోయిన్ అందరూ దశల తరబడి ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా ఎదుగుతున్నారంటే దానికి అందాల ఆరబోత కూడా ఒక కారణమే.
కానీ దీనికి అతీతమైన వారు కూడా కొందరు ఉన్నారు. పాతతరం వారిని పక్కన పెడితే నేటి తరంలో నిత్యామీనన్, సాయి పల్లవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ వంటి వారు స్కిన్ షోకు దూరంగా ఉంటున్నారు. అయినా కూడా తమ సత్తా చాటుతున్నారు. దీంతో కేవలం అందాలు ఆరబోసే హీరోయిన్స్ మాత్రమే కాదు వాటికి పూర్తి వ్యతిరేకంగా నిలిచి టాలెంట్ తో మాత్రమే ఇండస్ట్రీలోకి దూసుకు రాగలమని నిరూపించిన హీరోయిన్స్ లలో వీరు ముఖ్యులు. వారిలో సాయి పల్లవి గురించి ముందుగా చెప్పుకోవాలి.
ఈమెకి యూత్ లో ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. అందరూ ఈమెని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈమె హీరోయిన్‌గా నటించిన ఆఖరి చిత్రం విరాటపర్వం. ఇది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఆమె ఏ సినిమాకు ఇప్పటివరకు ఒప్పుకోలేదు.
అందులోనూ దైవచింతనలో మునిగిపోయి ఇటీవల పుట్టపర్తిలో తన కుటుంబంతో సహా కనిపించింది. దాంతో ఆమె ఆధ్యాత్మికత వైపు మరలిందని ఇక సాయిపల్లవి సినిమాలు ఆపేస్తుందని వృత్తిపరంగా ఆమె ఒక డాక్టర్ కాబట్టి త్వరలోనే ఒక హాస్పిటల్ స్థాపించబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది.
అభిమానులు కూడా వీటిని నమ్మారు. ఎందుకంటే ఆమె గురించి వారికి బాగా తెలుసు. ఇష్టం లేని పని చేయలేదని.. సరైన పాత్రలు రాకపోతే ఆమె మరో ప్రొఫెషన్ చూసుకుంటుందని వారికి తెలుసు. కానీ ఈ వార్తలపై సాయి పల్లవి తనదైన విధంగా స్పందించింది.
ఆమె మాట్లాడుతూ.. నేను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చాలని కోరుకుంటాను. పాత్రలు కూడా అలాంటివే సెలెక్ట్ చేసుకుంటాను. నా తల్లిదండ్రులు నన్ను వెండితెరపై చూసినప్పుడు గర్వపడేలా ఉండాలి గానీ వాళ్లు నన్ను చూసి సిగ్గుతో తలదించుకునే పాత్రలు మాత్రం నేను చేయను.
విరాటపర్వం తరువాత ఎన్నో కథలు విన్నాను. కానీ వాటిలో నా నటనకి ఏ మాత్రం ప్రాధాన్యత లేదు. నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కినప్పుడే నేను సినిమా చేస్తాను. అప్పటివరకు ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. మరి సాయిపల్లవి ఎందుకు సినిమాలు చేయడం లేదంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారందరికీ ఈ సమాధానం సరిపోతుందనే భావించాలి.
