HomelatestNIT Warangal | ఎన్ఐటీ వరంగల్‌లో స్వచ్ఛ క్యాంపెయిన్

NIT Warangal | ఎన్ఐటీ వరంగల్‌లో స్వచ్ఛ క్యాంపెయిన్

  • అధ్యాపకులు,విద్యార్థులు, సిబ్బంది భాగస్వామ్యం
  • నెలలో ఆఖరి శనివారం కార్యక్రమం
  • పరిశుభ్రమైన విద్యా సంస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్ఐటీ వరంగల్‌ (NIT Warangal) లో శనివారం స్వచ్ఛ్ క్యాంపెయిన్‌ (ప్రచారం) కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్‌ఐటీ వరంగల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బిద్యాధర్‌ సుబుధి మాట్లాడుతూ.. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల కోసం పర్యావరణహిత క్యాంపస్‌ను రూపొందించేందుకు ఈ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నెలలో ఒకరోజు

ప్రతి నెలా చివరి శనివారం 2 గంట‌ల పాటు ఈ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహిస్తామని, ఈ క్యాంపస్‌ను పరిశుభ్రంగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. దేశంలోనే పరిశుభ్రమైన విద్యాసంస్థల్లో ఒకటిగా ఎన్‌ఐటీ వరంగల్‌ను తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

స్వచ్ఛ క్యాంపస్ ప్రతిజ్ఞ

క్యాంపస్‌ని శుభ్రంగా ఉంచుతాం అని స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఞని వాలంటీర్లు చేత చేయించారు. వాలంటీర్లు బృందాలుగా విభజించబడ్డారు. న్యూ అకడమిక్ బిల్డింగ్, ఫుడ్ స్ట్రీట్, ఇన్స్టిట్యూట్ ఫుడ్ కోర్టుల ప్రాంతాలను శుభ్రం చేశారు. దాదాపు 650 మంది అధ్యాపకులు, సిబ్బంది స్వచ్ఛందంగా క్లీనింగ్ డ్రైవ్‌లో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వాలంటీర్లందరూ కలిసి అల్పాహారం చేశారు.

ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని విజయవంతం చేసినందుకు ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ అధ్యాపకులు మరియు సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. క్యాంపస్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ప్రొఫెసర్‌ ఐఎకె రెడ్డి, కమిటీ సభ్యులు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఆర్‌.దయానిధి, ఆయన బృందంతో పాటు బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. డీన్‌లు, రిజిస్ట్రార్‌, విభాగాధిపతులు పాల్గొన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular