CM Jagan ఇక బిజిబిజీ.. వరుస రివ్యూలు.. పర్యటనలు 13న ఢిల్లీకి.. 15న విజయనగరం 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు విధాత: దాదాపు పదిరోజులుగా రాష్ట్రానికి దూరంగా కుటుంబంతో బాటు విదేశీ పర్యటనలో గడిపిన సీఎం వైయస్ జగన్ ఈరోజు తెల్లవారు జామున తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు మంత్రులు, పోలీసు, సాధారణ పరిపాలన ఉన్నతాధికారులు ఎయిర్ పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ను ఈనెల రెండో తేదీన […]

CM Jagan
- ఇక బిజిబిజీ.. వరుస రివ్యూలు.. పర్యటనలు
- 13న ఢిల్లీకి.. 15న విజయనగరం
- 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు
విధాత: దాదాపు పదిరోజులుగా రాష్ట్రానికి దూరంగా కుటుంబంతో బాటు విదేశీ పర్యటనలో గడిపిన సీఎం వైయస్ జగన్ ఈరోజు తెల్లవారు జామున తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు మంత్రులు, పోలీసు, సాధారణ పరిపాలన ఉన్నతాధికారులు ఎయిర్ పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ను ఈనెల రెండో తేదీన లండన్ వెళ్లి అక్కడ తన కుమార్తెను కలిశారు. ఆ తరువాత కుటుంబంతో బాటు పలు ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా అయన రాష్ట్రంలో లేని ఈ పదిరోజుల్లో విపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ కావడం వంటి పలు ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. అయన కాన్వాయ్ కు ప్రజలు సైతం స్వాగతం పలికారు.. రోడ్ల పక్కన ఆయన్ను చూస్తూ జనం అభివాదం చేయగా అయన సైతం నమస్కారం పెడుతూ క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు. ఇక అయన ఈ వారం రోజులూ చాలా బిజీగా గడుపుతారు. సీనియర్ అధికారులతో సమీక్ష జరుపుతారు.
https://x.com/YSRCParty/status/1701417798876930297?s=20
రాష్ట్రంలోని శాంతి భద్రతలు, రాజకీయ పరిణామాల మీద సన్నిహిత మంత్రులు.. సలహాదారులతో సమీక్ష ఉంటుంది. ఆ తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలను పిలిచి పరిస్థితులమీద ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. రేపు. 13న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, హోమ్ మంత్రి అమిత్ షాను కలుస్తారని అంటున్నారు. తరువాత మంత్రిమండలి సమావేశం ఉంటుంది.. ఈనెల 20న శాసన సభ వర్షాకాల సమావేశాలు మొదలవుతాయి. ఈలోపు 15న విజయనగరం పర్యటనకు వెళ్తారు.
https://x.com/YSRCParty/status/1701417808708419916?s=20
అక్కడ ఒక మెడికల్ కాలేజీని స్వయంగా ప్రారంభిస్తారు.. అదే సమయంలో మరో నాలుగు కాలేజీలను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ ఐదు కాలేజీల్లో మొన్ననే మొదటి సంవత్సరం క్లాసులు మొదలయ్యాయి. జగన్ మొత్తం 15 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు మొదలవగా 2024 విద్యాసంవత్సరంలో మరో ఐదు కాలేజీల్లో క్లాసులు మొదలవుతాయి. మొత్తానికి జగన్ ఇక బిజీ బిజీగా ఉంటారని తెలుస్తోంది.
