- చంద్రబాబు, పవన్ మీద జగన్ సెటైర్లు
విధాత: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద విరుచుకు పడ్డారు. వాళ్లిద్దరూ అసలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదని, వాళ్లకు ఇక్కడ అసలు నివాసం లేదని, కేవలం ఎన్నికల సమయంలో వచ్చి తరువాత హైదరాబాద్ జూబిలీ హిల్స్ లో నివాసం ఏర్పరచుకునే టైంపాస్ నాయకులూ అని విరుచుకుపడ్డారు.
మత్స్యకార భరోసా ఆర్థికసాయం అందించే సభలో నేడు మాట్లాడిన జగన్ ప్రతిపక్షాల మీద గట్టి కామెంట్స్ చేసారు. రెండు సినిమాల మధ్య గ్యాప్ దొరికితే ఆంధ్రకు వచ్చి రాజకీయం చేస్తారని, తరువాత హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటూ చంద్రబాబు చెప్పినట్లల్లా అదే ఓ జోకర్ లాంటి వాడని పవన్ మీద ఆరోపణలు చేసారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నానని, అప్పట్నుంచి ఇక్కడే ఉంటున్నాని అంటూ చంద్రబాబు, లోకేష్ లను నాన్ లోకల్ వాళ్ళుగా ప్రజలకు గుర్తు చేసారు.
దత్తతండ్రికి, దత్తపుత్రుడికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్!#PackageStarPK #CBNPolitricks pic.twitter.com/QGVmE1oLQK
— YSR Congress Party (@YSRCParty) May 16, 2023
చంద్రబాబు చెబితే ఒంటరిగా, విడివిడిగా పోటీకి, కలిసి పోటీకి,, రహస్యంగా పొత్తు పెట్టుకుని పోటీకి.. ఎలా కావాలంటే అలా నడుచుకునేందుకు దత్తపుత్రుడు (పవన్ కళ్యాణ్) రెడీగా ఉంటారని ఎద్దేవా చేసారు. ఒక్కో ఎన్నికకు ఒక్కో వేషంలో వచ్చి జనాన్ని మోసం చేస్తుంటాయి, తాను మాత్రం ప్రజల ముందే ఉంటానని జగన్ చెప్పుకొచ్చారు. పద్నాలుగేళ్ల సీఎం చంద్రబాబుకు అసలు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు.