కవిత కేసు విచారణ పై స్పందించిన సీఎం కేసీఆర్ విధాత: మహారాష్ట్ర (Maharashtra) లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పోటీ చేస్తుందని సీఎం కేసీఆర్ (CM KCR) వెల్లడించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ మేరకు డిసెంబర్లో జరుగుతాయి అన్నారు. అందుకు పార్టీ శ్రేణులు అంతా సంసిద్ధంగా ఉండాలన్నారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలన్నారు. ఇక […]

కవిత కేసు విచారణ పై స్పందించిన సీఎం కేసీఆర్

విధాత: మహారాష్ట్ర (Maharashtra) లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పోటీ చేస్తుందని సీఎం కేసీఆర్ (CM KCR) వెల్లడించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ మేరకు డిసెంబర్లో జరుగుతాయి అన్నారు. అందుకు పార్టీ శ్రేణులు అంతా సంసిద్ధంగా ఉండాలన్నారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలన్నారు.

ఇక మీదట టీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాలు ఉండవని, బీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాలు మాత్రమే ఉంటాయన్నారు. మార్చి 1 నుంచి ఏప్రిల్ వరకు పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు, ఏప్రిల్ 25 న గ్రామస్థాయిలో పార్టీ జెండాల ఆవిష్కరణ, ఏప్రిల్ 27న ఎల్బీ స్టేడియంలో బీఆర్ఎస్ ప్రతినిధుల సభ, అక్టోబర్‌లో వరంగల్ భారీ బహిరంగసభ ఉంటుందన్నారు.

సమావేశంలో దళిత బంధు పథకం అమలు తీరుపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వరంగల్ లో ఒక ఎమ్మెల్యే, ఆదిలాబాద్ లో కొందరు పథకం అమలులో డబ్బులు తీసుకున్నట్లు నా దగ్గర సమాచారం ఉందని, మళ్లీ రిపీట్ అయితే సహించనంటూ హెచ్చరించారు.

కవిత కేసు విచారణపై స్పందించిన సీఎం కేసీఆర్

కవితను ఈడీ విచారణపై స్పందించిన సీఎం కేసీఆర్. ఎంత మంచిగా పని చేసిన బద్నాం చేసే వాళ్ళు ఉంటారన్నారు. గంగుల, రవిచంద్ర ఇప్పుడు నా బిడ్డ వరకు వచ్చారన్నారు. కడుపు కట్టుకొని జాగ్రత్తగా పని చేయాలన్నారు.

Updated On 10 March 2023 1:56 PM GMT
Somu

Somu

Next Story