విధాత: ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామపంచాయతీలు ఉన్నాయి. రూ. 10 లక్షల చొప్పున గ్రామపంచాయతీలకు మంజూరు చేస్తున్నాను.
పెద్ద తండా, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి 10 వేలకు జనాభా మించి ఉన్నాయి. వీటికి కూడా రూ. 10 కోట్లు ఇస్తున్నాం. ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 50 కోట్లు, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు రూ. 30 కోట్ల చొప్పున కేటాయిస్తున్నాం.
ఈ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేస్తాం. ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు నెల రోజుల్లో మంజూరు చేయాలి. ఫోటో జర్నలిస్టు, కెమెరా జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి అని కేసీఆర్ సూచించారు. ఖమ్మం మున్నేరు నదిపై వంతెన మంజూరు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.