విధాత: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) షెడ్యూల్ ప్రకారము డిసెంబర్లోనే జరుగుతాయని సీఎం కేసీఆర్ (CM KCR) స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్ లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ముందస్తు ఎన్నికల ఊహాగానాలను కొట్టివేస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లోనే జరుగుతాయని నేతలు అందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
నేతలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలన్నారు. ప్రజల్లోనే ఉండాలని,పాదయాత్రలు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గం సమావేశాలు నిర్వహించుకోవాలని, ప్రభుత్వ ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
అక్టోబర్లో బిఆర్ఎస్ ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ తిరిగి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి అన్నారు.