CM KCR
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఈనెల 12న సీఎం కేసీఆర్ హన్మకొండకు రానున్నట్లు తెలిసింది. మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ లో రాష్ట్ర రైతు విమోచన కార్పొరేషన్ ఛైర్మెన్ నాగుర్ల వెంకటేశ్వర్ రావు కుమారుని వివాహానికి బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ హాజరుకానున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కలెక్టర్లు, ఎంఎల్ఏలు, ప్రజాప్రతినిధులతో ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చెబుతున్నారు. అయితే సీఎం రాకకు సంబంధించి అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా లేదు.