కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, ఎంపీ రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పందించారు. రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని కేసీఆర్ ఖండించారు. మోదీ పాల‌న ఎమ‌ర్జెన్సీని త‌ల‌పిస్తోందని, ఆయ‌న ప‌త‌నాన్ని కొని తెచ్చుకుంటున్నార‌ని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ ప్ర‌క‌ట‌న ఇదే.. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య […]

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, ఎంపీ రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పందించారు. రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని కేసీఆర్ ఖండించారు. మోదీ పాల‌న ఎమ‌ర్జెన్సీని త‌ల‌పిస్తోందని, ఆయ‌న ప‌త‌నాన్ని కొని తెచ్చుకుంటున్నార‌ని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

కేసీఆర్ ప్ర‌క‌ట‌న ఇదే..

భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం.

ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు.

పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి.

ప్రజాస్వామ్యం మరింత దిగజారింది : మమత

రాజ్యంగబద్ధమైన మన ప్రజాస్వామ్యం ఈ రోజు మరింత కిందికి దిగజారిన సందర్భాన్ని చూస్తున్నామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘ప్రధాని మోదీ యొక్క నూతన భారతదేశంలో బీజేపీకి ప్రతిపక్ష నాయకులే ప్రధాన టార్గెట్‌గా మారారు. మరోవైపు నేర చరిత్ర ఉన్న బీజేపీ నాయకులు మంత్రివర్గంలో చేరారు. ప్రతిపక్ష నాయకులు తమ ఉపన్యాసాలకు అనర్హత వేటుకు గురవుతున్నారు. ఈ రోజు మన రాజ్యంగబద్ధ ప్రజాస్వామ్యం మరింత దిగజారడాన్ని చూస్తున్నాం’ అని ట్వీట్‌ చేశారు.

దొంగను దొంగ అంటే నేరమైంది : ఉద్దవ్‌ ఠాక్రే ట్వీట్‌

దొంగను ఎవరైనా దొంగ అంటే నేరమైపోయిందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. రాహుల్‌పై అనర్హత వేటు వేయడంపై ఆయన స్పందిస్తూ.. ‘రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. దొంగను దొంగ అనడం మన దేశంలో నేరమైపోయింది. దొంగలు, లూటీకోరులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు కానీ.. రాహుల్‌గాంధీకి శిక్షపడింది. ఇది ప్రజాస్వామ్యాన్ని నేరుగా హత్య చేయడమే. అన్ని ప్రభుత్వ వ్యవస్థలు ఒత్తిడిలో ఉన్నాయి. ఇది నిరంకుశత్వం ముగింపునకు ఆరంభం. ఆ పోరాటానికి ఇప్పుడు కావాల్సింది దిశానిర్దేశమే’ అని ఆయన పేర్కొన్నారు.

ఆయన ఓబీసీలను కించపర్చాడు.. క్షమాపణ చెప్పలేదు : ప్రహ్లాద్‌ జోషి

బీజేపీ ప్రభుత్వం రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసిందనడాన్ని బీజేపీ నేత, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఖండించారు. ‘ఎవరిపై నిరసన వ్యక్తం చేస్తున్నారో కాంగ్రెస్‌వారు చెప్పాలి. ఎందుకంటే.. ఈ నిర్ణయం కోర్టు తీసుకున్నది. ఏ రాజకీయ పార్టీ తీసుకున్నది కాదు. వారు న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు. ఆయన (రాహుల్‌గాంధీ) ఓబీసీ కమ్యూనిటీని అవమానించారు. పైగా.. క్షమాపణ చెప్పేందుకు పొగరుమోతు తనంతో తిరస్కరించారు. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు’ అని జోషి పేర్కొన్నారు.

Updated On 24 March 2023 1:40 PM GMT
krs

krs

Next Story