CM KCR కర్ణాటకలో ఎవరు గెలిచినా మనకేమీ ఢోకా లేదు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మంత్రులు కలుపుకొని వెళ్లాలి బీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీలో సీఎం కేసీఆర్ విధాత: ఎంత చెప్పినా కొంత మంది ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవడం లేదని, ఇప్పటికైనా మార్చుకోకపోతే వేటు తప్పదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హెచ్చరించారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేల […]

CM KCR

  • కర్ణాటకలో ఎవరు గెలిచినా మనకేమీ ఢోకా లేదు
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మంత్రులు కలుపుకొని వెళ్లాలి
  • బీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీలో సీఎం కేసీఆర్

విధాత: ఎంత చెప్పినా కొంత మంది ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవడం లేదని, ఇప్పటికైనా మార్చుకోకపోతే వేటు తప్పదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హెచ్చరించారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేల పనితీరుపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పని తీరు మార్చుకోవాలన్నారు.

ముఖ్యంగా హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేల పై సీరియస్ అయ్యారని సమాచారం. పలు సార్లు సూచనలు చేసినా వైఖరి మారకుంటే టికెట్లు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారని తెలిసింది. ఈ మేరకు ఈ సారి కొంత మంది సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వడం లేదని చెప్పకనే చెప్పారు. హైదరాబాద్లో కొంత మంది ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలు సరిగ్గా నిర్వహించలేదన్నారు.

ఎవరు ఏమేరకు పని చేస్తున్నారో తమ వద్ద మొత్తం రిపోర్ట్ ఉందని చెప్పారని తెలిసింది. పార్టీ అధిష్ఠానం ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరును గమనిస్తూనే ఉందని చెప్పారని సమాచారం. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకుండా పై పైన చేసే ప్రచారాలు పక్కన పెట్టాలని హెచ్చరించారని తెలిసింది. పథకాల ప్రచారంపై ఫోకస్ చేయాలని చెప్పారని సమాచారం.

ఈ 9 ఏళ్లలో మనం చేసిన కార్యక్రమాలు ప్రజలకు చెపితే చాలు ఓట్లు పడతాయని, కొత్త పథకాలు అవసరం లేదని అన్నారు. ఎమ్మెల్యేలంతా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 21 రోజులు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ 21 రోజులు ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లోనే ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏ ఒక్కరు కూడా హైదరాబాద్‌కు రావద్దని సూచించారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాన్ని పట్టించుకోవద్దు

రాష్ట్రంలో సర్వేలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయని, 105 నియోజక వర్గాలలో మనం గెలుస్తున్నామని సీఎం కేసీఆర్ పార్టీ నాయకులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారని విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరు కూడా కర్ణాటక ఫలితాలు పట్టించుకోవద్దని అన్నారని సమాచారం. ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుపై చర్చ జరపాలని నాయకులకు దిశానిర్దేశనం చేశారు.

Updated On 17 May 2023 1:09 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story