విధాత‌: బీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు, సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలు, స‌ర్పంచ్‌ల‌పై సెటైర్లు వేశారు. ప‌ద‌వులు రాగానే కొమ్ములు వ‌స్తాయి.. రెండు న‌ల్ల కండ్ల‌ద్దాలు వ‌స్తాయ‌ని చుర‌క‌లంటించారు. స‌ర్పంచ్‌లు అయితే అక్క‌ర్లేని దీర్ఘాలు ఉప‌యోగిస్తారంటూ త‌నదైన శైలిలో ప్ర‌సంగించి, స‌భికుల‌ను న‌వ్వించారు కేసీఆర్. భార‌త రాష్ట్ర స‌మితిలో ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్ర‌శేఖ‌ర్, మాజీ ఐఆర్ఎస్ చింత‌ల పార్థ‌సార‌థితో పాటు ప‌లువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా సీఎం […]

విధాత‌: బీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు, సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలు, స‌ర్పంచ్‌ల‌పై సెటైర్లు వేశారు. ప‌ద‌వులు రాగానే కొమ్ములు వ‌స్తాయి.. రెండు న‌ల్ల కండ్ల‌ద్దాలు వ‌స్తాయ‌ని చుర‌క‌లంటించారు. స‌ర్పంచ్‌లు అయితే అక్క‌ర్లేని దీర్ఘాలు ఉప‌యోగిస్తారంటూ త‌నదైన శైలిలో ప్ర‌సంగించి, స‌భికుల‌ను న‌వ్వించారు కేసీఆర్.

భార‌త రాష్ట్ర స‌మితిలో ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్ర‌శేఖ‌ర్, మాజీ ఐఆర్ఎస్ చింత‌ల పార్థ‌సార‌థితో పాటు ప‌లువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు.

అంద‌రికీ జ్ఞానం ఉండ‌దు. అన్ని ర‌కాల జ్ఞానం ఉండ‌టానికి ఆస్కారం ఉండ‌దు. అనేక రంగాల్లో ప‌ని చేసిన నిష్ణాతులు, గొప్ప విజ్ఞానం సంపాదించిన వారు ఉన్నారు. కానీ నేటి రాజ‌కీయ నాయ‌కులు వారిని పిలిచి మాట్లాడే ప‌రిస్థితి లేదు. గౌర‌వించే ప‌ద్ధ‌తి లేదు. వారి స‌ల‌హాలు స్వీక‌రించే స్థితి లేదు.

జ్ఞానం ఎక్క‌డ దొరికితే అక్క‌డ స‌ముపార్జించుకోవాలి. మ‌న‌కు తెలియ‌నిదాన్ని తెలియ‌దు అని నిర్భయంగా ఒప్పుకుని, జ్ఞానాన్ని సంపాదించే ప్ర‌య‌త్నం చేస్తే, ప్ర‌జ‌ల కోసం మంచి ప‌నులు చేస్తాం. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితులు లేవు. కానీ ఇప్పుడు ఆ భ‌యంక‌ర‌మైన లోపం ఉంది.

ఎమ్మెల్యే కాగానే కొమ్ములు వ‌చ్చేస్తయి. క‌డుపులో గ్యాస్ వ‌స్త‌ది. భాష మారిపోత‌ది, వేషం మారిపోతుంది. కండ్ల‌కు రెండు న‌ల్ల కండ్ల‌ద్దాలు వ‌చ్చేస్త‌యి. మ‌న గ్రామంలో మ‌న మ‌ధ్య ఉండే ఆయ‌న అనుకోకుండా స‌ర్పంచ్ అయిపోత‌డు. లేని దీర్ఘాలు, అక్క‌ర్లేని దీర్ఘాలు వ‌స్తాయి. ఒక అస‌హ‌జ‌త‌ను సంత‌రించుకుని, ఏమో అయిపోయాన‌ని నేల విడిచి సాము చేసే నాయ‌క‌త్వాన్ని చూస్తున్నాం అంటూ కేసీఆర్ మాట్లాడారు.

Updated On 3 Jan 2023 1:46 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story