CM KCR | కొల్లాపూర్ అభివృద్ధి కి రూ.25 కోట్లు  పాలిటెక్నిక్ కళాశాల, గ్రామపంచాయతీల అభివృద్ధికి రూ.15 లక్షలు పలు ఎత్తి పోతల పథకాలకు సర్వే మహబూబ్ నగర్ కు ఇంజినీరింగ్ కళాశాల వరాల జల్లు కురిపించిన సీఎం కెసిఆర్ విధాత,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కొల్లాపూర్, మహబూబ్ నగర్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు వరాల జల్లు కురిపించారు. శనివారం కొల్లాపూర్ సమీపంలో ని సింగోటం చౌరస్తాలో ఏర్పాటు చేసిన […]

CM KCR |

  • కొల్లాపూర్ అభివృద్ధి కి రూ.25 కోట్లు
  • పాలిటెక్నిక్ కళాశాల, గ్రామపంచాయతీల అభివృద్ధికి రూ.15 లక్షలు
  • పలు ఎత్తి పోతల పథకాలకు సర్వే
  • మహబూబ్ నగర్ కు ఇంజినీరింగ్ కళాశాల
  • వరాల జల్లు కురిపించిన సీఎం కెసిఆర్

విధాత,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కొల్లాపూర్, మహబూబ్ నగర్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు వరాల జల్లు కురిపించారు. శనివారం కొల్లాపూర్ సమీపంలో ని సింగోటం చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ.25 కోట్లు సీఎం ప్రత్యేక నిధులనుంచి మంజూరు చేశారు.

అలాగే పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు, పలు ఎత్తి పోతల పథకాలకు సర్వే వంటి పనులకు ఆమోదం తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారు.ఈ బహిరంగ సభకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి భారీ సంఖ్య లో ప్రజలు హాజరయ్యారు. ప్రతి నియోజకవర్గం లోని కొన్ని గ్రామాలకు కలిపి ప్రత్యేకoగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణం నాయకులు, కార్యకర్తలతో నిండిపోయింది.ఈ సభను ఉద్దెశించి పలువురు మంత్రులు ప్రసంగించారు.

కారణజన్ముడు కెసిఆర్: మంత్రి శ్రీనివాస్ గౌడ్

పాలమూరు బీడు భూములకు సాగు నీరు అందించి సస్యశామలం చేసిన ముఖ్యమంత్రి కారంజన్ముడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ను ప్రారంభించి ఇక్కడి రైతుల గోస తీర్చిన కెసిఆర్ కు రుణ పడిఉంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాష్ట్రo సంధించారని, తెలంగాణ వచ్చాక కృష్ణా, తుంగభద్ర నదుల నీటిని ఒడిసి పట్టి జిల్లా రైతంగానికి సాగునీరు అందించాలని అనుకున్న కెసిఆర్ వెంటనే రాజోలి బండ దైవర్షన్ స్కీమ్ నుంచి సాగునీటిని అందించారని, అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసారన్నారు.

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ఏడు ఏళ్ళ లో పూర్తి చేసి ఇక్కడి పొలాలకు సాగునీరు అందించి అపర భగీరథునిగా పేరు పొందారన్నారు.ఒకప్పుడు జిల్లా వలసలకు పేరుపొందిదని, తెలంగాణ రాష్ట్రo ఏర్పడ్డాక కెసిఆర్ చేసిన అభివృద్ధి ని చూసి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వలసలు వస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ఈ ప్రాజెక్టు పై విపక్షాలు పలు రకాలుగా మాట్లాడుతున్నారని, వారికి ఒకటే చెప్తున్నా ప్రాజెక్టు అభివృద్ధి ని చూడాలంటే మావెంట రండని, మేమే స్వయం గా వాహనాలు ఏర్పాటు చేసి చూపిస్తామన్నారు.

బీడు భూములు సస్యశ్యామలం: వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

పాలమూరు బీడు భూములు సాగు నీటి తో పచ్చగా మారాబోతున్నాయి.. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పలు జిల్లాలకు వరంగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కెసిఆర్ పాదం మోపాకే రాష్ట్ర o లో పచ్చదనం వెల్లువిరుస్తోందని, అటు కాళేశ్వరం, ఇటు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు తో రాష్ట్రo సుభిక్షంగా మారిందన్నారు. అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు భాక్రానంగల్ ప్రాజెక్టు 15 ఏళ్ల సమయం తీసుకుని నిర్మించి కేవలం 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని, కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ కేవలం ఈ ప్రాజెక్టు ను ఏడేళ్లలో పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు నీరు అందించనున్నారన్నారు.

ఈ ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారో అని చంద్ర బాబు నాయుడు అంటే అప్పట్లో బూతుపూర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కెసిఆర్ పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కు ఎవరు అడ్డం వచ్చినా నిర్మించి తీరుతామని ప్రకటించి నేడు సాకరం చేసారన్నారు. కేవలం 25 వేల ఎకరాలు భూసేకరణ చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు.ఈ కార్యక్రమం లో మంత్రులు,ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీ లు,జడ్పీ చైర్మన్ లు, కార్పొరేషన్ చైర్మన్ లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు పాల్గొన్నారు.

కెసిఆర్ ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

పాలమూరు -రంగారెడ్డి ప్రారంభానికి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కాన్ వ్వాయిని ఆమన్ గల్ పట్టణంలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తం అయిన పోలీసు లు వారిని పక్కకు లాగారు. కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదలు చేశారు.అంతకు ముందే కొల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Updated On 16 Sep 2023 5:03 PM GMT
krs

krs

Next Story