CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో శుక్రవారం రాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం రాత్రి నుంచి జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతుండటంతో ఆస్పత్రిలో చేరాల్సిందిగా సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవీ రావు సూచించారు. సీఎం కేసీఆర్ నిన్నరాత్రి ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వాకబు చేశారు. ప్రస్తుతం శోభ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

CM KCR |
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో శుక్రవారం రాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు.
గురువారం రాత్రి నుంచి జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతుండటంతో ఆస్పత్రిలో చేరాల్సిందిగా సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవీ రావు సూచించారు.
సీఎం కేసీఆర్ నిన్నరాత్రి ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వాకబు చేశారు. ప్రస్తుతం శోభ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
