HomelatestCM Siddaramaiah | చేసిన 5 వాగ్దానాలు.. 2 గంటల్లో అమలు చేసిన సీఎం సిద్ధరామయ్య

CM Siddaramaiah | చేసిన 5 వాగ్దానాలు.. 2 గంటల్లో అమలు చేసిన సీఎం సిద్ధరామయ్య

CM Siddaramaiah |

  • సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారంలో రాహుల్‌గాంధీ
  • విపక్ష నేతల సమక్షంలో సీఎంగా ప్రమాణం చేసిన సిద్ధు
  • కర్ణాటక తొలిక్యాబినెట్ భేటీలో నిర్ణయం
  • ప్రమాణ చేసిన 2 గంటల్లో నెరవేరిన వాగ్దానం
  • మే 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు

విధాత : కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము ఐదు వాగ్దానాలు చేశామని, ఇప్పుడు వాటిని అమలు చేసే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ చెప్పారు. వివిధ విపక్ష పార్టీలకు చెందిన నాయకుల సమక్షంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా (CM Siddaramaiah) , డీకే శివకుమార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. కర్ణాటకలో స్వచ్ఛమన, అవినీతి రహితమైన ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పారు. తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే హామీల అమలుకు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

‘మేం మీకు ఐదు హామీలు ఇచ్చాం. మేం తప్పుడు వాగ్దానాలు చేయటం లేదని నేను మీకు ముందే చెప్పాను. చెప్పింది చేసి చూపిస్తాం. ఒకటి రెండు గంటల్లో కర్ణాటక క్యాబినెట్‌ సమావేశంలో ఆ ఐదు వాగ్దానాలు చట్టాలుగా మారుతాయి’ అని తెలిపారు.

కర్ణాటక ఎన్నికల్లో విద్వేషంపై ప్రేమ విజయం సాధించిందని అన్నారు. తమ పార్టీ పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల వెంట ఉండబట్టే విజయం సాధించగలిగిందని చెప్పారు. ‘మా వద్ద నిజం ఉన్నది. పేదలు మా వెంట ఉన్నారు. బీజేపీ దగ్గర సొమ్ములు ఉన్నాయి. పోలీసులు, అన్నీ ఉన్నాయి.. కానీ.. కర్ణాటక ప్రజలు ఆ శక్తులన్నింటినీ ఓడించారు. అంతకు ముందు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, మంత్రుల చేత గవర్నర్ తాహ్వార్‌చంద్‌ గెహ్లాట్‌ ప్రమాణం చేయించారు.

రెండో సారి సీఎంగా సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండసారి సిద్ధరామయ్య ప్రమాణం చేశారు. అనంతరం డీకే డిప్యూటీగా ప్రమాణం చేశారు. వారిని కాంగ్రెస్‌ అగ్రనాయకులు అభినందించారు. గవర్నర్‌ ఈ ఇద్దరికీ మెమెంటోలు అందజేశారు.

మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గేతోపాటు.. జీ పరమేశ్వర, కేహెచ్‌ మునియప్ప, కేజీ జార్జ్‌, ఎంబీ పాటిల్‌, సతీశ్‌ జర్కిహోలి, రామలింగారెడ్డి, జమీర్‌ అహ్మద్‌ఖాన్‌, అమిత్‌ భరద్వాజ్‌,

ఈ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్‌గెహ్లాట్‌, భూపేశ్‌ భగేల్‌, సుఖ్విందర్‌సింగ్‌ సుఖు, వివిధ ప్రతిపక్షాల నాయకులు కూడా హాజరయ్యారు.

అమలులోకి ఐదు హామీలు

కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలను ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే అమలు చేసింది. చెప్పింది చేసి చూపిస్తామని తెలియజేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఐదు హామీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నమ్మిన ప్రజలు అధికారం అప్పగించారు. దీంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేసిన సూచన మేరకు కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మొదటి మంత్రి వర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని అమలు చేసింది.

ఈ కీలకమైన ఐదు వాగ్దానాలు నెరవేర్చడానికి ఏడాదికి రూ. 50 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. ఈ నిర్ణయాల అమలు విధి విధానాలను వచ్చే మంత్రి వర్గ సమావేశంలో ఖరారు చేయాలని నిర్ణయించారు.

22 నుంచి అసెంబ్లీ

ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్వీ దేశ్పాండేను ప్రొటెం స్పీకర్గా నియమించారు. ఈ సమావేశాల్లో ఎమ్మల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. తదుపరి స్పీకర్ను ఎన్నుకుంటారు.

ఆ ఐదు వాగ్దానాలు ఇవే

1. గృహజ్యోతి- ఈ పథకం కింద ఒక కుంటుంబానికి 200 యూనిట్ల వరకు ప్రతినెల ఉచిత విద్యుత్ సరఫరా
2. గృహలక్ష్మి- ఈపథకం కింద కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతి నెల రూ. 2 వేల భృతి
3. అన్న భాగ్య పథకం- దీనికింద దారిద్ర్యరేఖకు దిగువనున్న ప్రతి కుటుంబానికి ఉచితంగా ప్రతి నెల రూ.10 కిలోల బియ్యం
4. యువనిధి- ఈ పథకం కింద పట్టభద్రులైన నిరుద్యోగులకు (18 నుంచి 25 సంవత్సరాల వయసు వారికి) నెలకు రూ. 3 వేల భృతి, డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ. 1500 భృతి
5. మహిళా శక్తి- ఈ పథకం కింద కర్ణాటక రాష్ట్రంలోని ఆర్డినరీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular