విధాత : మా ఇంటికి భోజ‌నానికి రావాల‌ని ఓ ద‌ళిత కుటుంబాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానించారు. సీఎం ఆహ్వానాన్ని ఆ ద‌ళిత వ్య‌క్తి అంగీక‌రించాడు. ఆ ద‌ళిత వ్య‌క్తి ప్ర‌స్తుతం గుజ‌రాత్ అహ్మదాబాద్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. గుజ‌రాత్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇవాళ పారిశుద్ధ్య కార్మికుల‌తో కేజ్రీవాల్ స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా పారిశుద్ధ్య కార్మికుడైన ద‌ళిత వ్య‌క్తి మాట్లాడుతూ.. గ‌తంలో ఢిల్లీలో ఓ ఆటో రిక్షా కార్మికుడి ఇంట్లో […]

విధాత : మా ఇంటికి భోజ‌నానికి రావాల‌ని ఓ ద‌ళిత కుటుంబాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానించారు. సీఎం ఆహ్వానాన్ని ఆ ద‌ళిత వ్య‌క్తి అంగీక‌రించాడు. ఆ ద‌ళిత వ్య‌క్తి ప్ర‌స్తుతం గుజ‌రాత్ అహ్మదాబాద్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. గుజ‌రాత్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇవాళ పారిశుద్ధ్య కార్మికుల‌తో కేజ్రీవాల్ స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా పారిశుద్ధ్య కార్మికుడైన ద‌ళిత వ్య‌క్తి మాట్లాడుతూ.. గ‌తంలో ఢిల్లీలో ఓ ఆటో రిక్షా కార్మికుడి ఇంట్లో భోజ‌నం చేసేందుకు మీరు వెళ్లార‌ని కేజ్రీవాల్‌ను ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు వాల్మికీ(ద‌ళిత‌) క‌మ్యూనిటీకి చెందిన మా ఇంట్లో భోజ‌నం చేసేందుకు వ‌స్తారా? అని కేజ్రీవాల్‌ను అత‌ను అడిగాడు.

ఇందుకు కేజ్రీవాల్ ఇలా స్పందించారు. త‌ప్ప‌కుండా నేను మీ ఇంటికి వ‌చ్చి భోజ‌నం చేస్తాను. దాని కంటే ముందు.. నాదొక విన్న‌పం. మీరు అంగీక‌రించాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తి నాయ‌కుడు ద‌ళితుల ఇండ్ల‌కు వెళ్లి భోజ‌నాలు చేస్తున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క నాయ‌కుడు కూడా ద‌ళితుల‌ను త‌మ ఇండ్ల‌లో భోజ‌నాలు చేసేందుకు ఆహ్వానించ‌లేదు. కాబ‌ట్టి మీరే త‌మ ఇంటికి భోజ‌నానికి రావాల‌ని కేజ్రీవాల్ ఆ పారిశుద్ధ్య కార్మికుడిని ఆహ్వానించారు. దీంతో ఆ స‌భా ప్రాంగ‌ణంలో చ‌ప్ప‌ట్లు మార్మోగాయి.

పారిశుద్ధ్య కార్మికుడు త‌న కుటుంబ స‌మేతంగా రేపు ఢిల్లీకి వెళ్లి, కేజ్రీవాల్‌తో క‌లిసి భోజ‌నం చేయ‌నున్నారు. ఇందుకు అయ్యే ఖ‌ర్చును కేజ్రీవాలే భ‌రించ‌నున్నారు. ఇక మ‌ళ్లీ అహ్మ‌దాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు కేజ్రీవాల్ ఆ ద‌ళిత వ్య‌క్తి ఇంట్లో భోజ‌నం చేయ‌నున్నారు.

Updated On 25 Sep 2022 4:43 PM GMT
subbareddy

subbareddy

Next Story