Wednesday, December 7, 2022
More
    Homelatestముంగీస - నాగుపాము మ‌ధ్య భీక‌ర యుద్ధం.. వీడియో వైర‌ల్

    ముంగీస – నాగుపాము మ‌ధ్య భీక‌ర యుద్ధం.. వీడియో వైర‌ల్

    విధాత: ముంగీస – నాగుపాముకు అస‌లే ప‌డ‌దు. అవి రెండూ ఒకేచోట ఉన్నాయంటే.. వాటి మ‌ధ్య యుద్ధం ఓ లెవ‌ల్‌లో ఉంటుంది. అస‌లు ముంగీస‌ను చూసిందంటే ఎంత‌టి పామైనా ప‌రుగులు పెట్టాల్సిందే. కానీ ఇక్క‌డ నాగుపాము – ముంగీస మ‌ధ్య భీక‌ర యుద్ధం జ‌రిగింది. దాదాపు ఓ రెండు నిమిషాల పాటు ఆ రెండు పోటాపోటీగా పొట్లాడుకున్నాయి.

    ఓ బుర‌ద నీటిలో న‌లుపు రంగులో ఉన్న నాగుపాము ప్ర‌త్య‌క్ష‌మైంది. అక్క‌డే ముంగీస కూడా ఉంది. ఇక ఆ నాగుపాము ప‌డ‌గ విప్పి బుస‌లు కొడుతోంది. ముంగీస ఊరుకుందా? అంటే లేదు. అది కూడా పాముపై యుద్ధానికి దిగింది. పాము కాటేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్పుడ‌ల్లా ముంగీస త‌ప్పించుకుంది.

    పాముపై దాడి చేసేందుకు కూడా ముంగీస య‌త్నించింది. పాము కూడా త‌ప్పించుకుంది. చివ‌ర‌కు నాగుపాము ఈ యుద్ధంలో ఓడిపోయింది. ముంగీస దెబ్బ‌కు పాము తోక ముడిచింది. ఈ వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్టు చేశారు. 2 ల‌క్ష‌ల మంది వీక్షించ‌గా, 13 వేల మంది లైక్ చేశారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page