విధాత: నాగుపామును ప‌ట్టేందుకు వెళ్లిన ఓ అర్చ‌కుడు ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘ‌ట‌న కృష్ణా జిల్లా కృత్తివెన్ను గుడిదిబ్బ గ్రామంలో శ‌నివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొండూరి నాగ‌బాబు శ‌ర్మ‌(48) అర్చ‌కుడిగా కొన‌సాగుతున్నాడు. హైద‌రాబాద్‌లో నివాస‌ముంటున్న నాగ‌బాబు శ‌ర్మ‌.. ద‌స‌రా పండుగ నిమిత్తం ఇటీవ‌లే గుడిదిబ్బ‌కు వ‌చ్చాడు. అయితే స్థానికంగా ఉన్న గోదాములో నాగుపామును రైతులు గ‌మ‌నించారు. ఇక పాములు ప‌ట్ట‌డంలో దిట్ట అయిన నాగ‌బాబు శ‌ర్మ‌ను రైతులు సంప్ర‌దించారు. గోదాములో పామును ప‌ట్టుకున్న […]

విధాత: నాగుపామును ప‌ట్టేందుకు వెళ్లిన ఓ అర్చ‌కుడు ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘ‌ట‌న కృష్ణా జిల్లా కృత్తివెన్ను గుడిదిబ్బ గ్రామంలో శ‌నివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొండూరి నాగ‌బాబు శ‌ర్మ‌(48) అర్చ‌కుడిగా కొన‌సాగుతున్నాడు. హైద‌రాబాద్‌లో నివాస‌ముంటున్న నాగ‌బాబు శ‌ర్మ‌.. ద‌స‌రా పండుగ నిమిత్తం ఇటీవ‌లే గుడిదిబ్బ‌కు వ‌చ్చాడు.

అయితే స్థానికంగా ఉన్న గోదాములో నాగుపామును రైతులు గ‌మ‌నించారు. ఇక పాములు ప‌ట్ట‌డంలో దిట్ట అయిన నాగ‌బాబు శ‌ర్మ‌ను రైతులు సంప్ర‌దించారు. గోదాములో పామును ప‌ట్టుకున్న శ‌ర్మ‌.. దాన్ని స‌మీప అట‌వీ ప్రాంతంలో విడిచేందుకు వెళ్తుండ‌గా, కాటేసింది. దీంతో బాధిత వ్య‌క్తి ఇంట్లోనే ప్ర‌థ‌మ చికిత్స చేసుకున్నాడు.

ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో స‌మీపంలో ఉన్న చిన‌పాండ్రాక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మెరుగైన వైద్యం కోసం మచీలిప‌ట్నం తీసుకెళ్లాల‌ని సూచించ‌డంతో అక్క‌డికి తీసుకెళ్లారు. అక్క‌డ చికిత్స పొందుతూ నాగ‌బాబు శ‌ర్మ ప్రాణాలు కోల్పోయాడు.

ఎంతో మందిని పాము కాటు బారి నుంచి ర‌క్షించిన అత‌నే పాముకాటుకు బ‌ల‌వ‌డాన్ని గ్రామ‌స్తులు జీర్ణించు కోలేక‌పోతున్నారు. నాగ‌బాబు శ‌ర్మ అంత్య‌క్రియలు గుడిదిబ్బ‌లో ఆదివారం నిర్వ‌హించారు. శ‌ర్మ‌కు భార్య‌, కుమారుడు, కూతురు ఉన్నారు.

Updated On 26 Sep 2022 2:45 PM GMT
subbareddy

subbareddy

Next Story