విధాత: ఇటీవలి కాలంలో నాగుపాములు ఎక్కడ అంటే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. అడవుల్లో, పంట పొలాల్లో కనిపించే నాగుపాములు.. గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి. బైకుల్లో ప్రత్యక్షమవుతున్నాయి. రెండు రోజుల క్రితం ఓ స్కూటీ ముందు భాగంలో బుసలు కొడుతూ పడగ విప్పి, అందర్నీ భయభ్రాంతులకు గురి చేసిన నాగుపాము స్టోరీ మరవకముందే.. అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
ఇప్పుడు ఏకంగా ఓ యువకుడి దుప్పట్లోకి దూరి నాగుపాము నిద్రించింది. అది కూడా రాతంత్రా. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిరోంజి గ్రామానికి చెందిన ఓ యువకుడు తన ఇంట్లో దుప్పటి కప్పుకొని నిద్రకు ఉపక్రమించాడు.
యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..
అయితే గాఢ నిద్రలో ఉండగా.. నలుపు రంగులో ఉన్న నాగుపాము ఆ యువకుడు పడుకున్న దుప్పట్లోకి దూరింది. ఆ పాము ఎలాంటి హానీ కలిగించకుండా ఆ అబ్బాయితో పాటు హాయిగా నిద్ర పోయింది. ఈ విషయం తెలియని యువకుడు పొద్దున్నే 6 గంటలకు మెలకువ రాగా పక్కనే బుసలు కొడుతున్న నాగుపాము శబ్దం వినిపించింది.
దీంతో ఆందోళనకు గురైన ఆ అబ్బాయి.. బెడ్ షీట్ తీసి చూడగా పాము కనిపించింది. దీంతో ఆ యువకుడు పాముపై బెడ్‌షీట్ వేసి భయంతో ఇంటి నుంచి బయటకు పరుగెత్తాడు. ఆ తర్వాత స్నేక్ క్యాచర్‌గా సమాచారం ఇవ్వగా స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టేశాడు. అది పడగ విప్పి బుసలు కొట్టడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాము యువకుడికి ఎలాంటి హానీ కలిగించకపోవడంతో.. కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.