Viral Video | ప్ర‌తి ఇంటి వ‌ద్ద కుక్క‌లు కాప‌లాగా ఉంటాయి. కాప‌లా కోసం కొంద‌రు కుక్క‌ల‌ను పెంచుకుంటారు. శ‌త్రువుల దాడి నుంచి త‌ప్పించుకునే విష‌యంలో కుక్క‌లు ఎంతో మేలు చేస్తుంటాయి. కానీ ఈ ఇంటి వ‌ద్ద కుక్క‌కు బ‌దులుగా పాము కాప‌లా ఉంది. అది కూడా నాగుపాము. ఇంటి త‌లుపు నుంచి బ‌య‌ట‌కు దూరి.. ప‌డ‌గ విప్పి బుస‌లు కొడుతూ.. ఇంట్లోకి ఎవ‌ర్నీ రాకుండా అడ్డుకుంది. ఆ పాము ప‌డ‌గను చూస్తే ఒళ్లంతా గ‌గుర్పాటుకు గురికాక […]

Viral Video | ప్ర‌తి ఇంటి వ‌ద్ద కుక్క‌లు కాప‌లాగా ఉంటాయి. కాప‌లా కోసం కొంద‌రు కుక్క‌ల‌ను పెంచుకుంటారు. శ‌త్రువుల దాడి నుంచి త‌ప్పించుకునే విష‌యంలో కుక్క‌లు ఎంతో మేలు చేస్తుంటాయి. కానీ ఈ ఇంటి వ‌ద్ద కుక్క‌కు బ‌దులుగా పాము కాప‌లా ఉంది. అది కూడా నాగుపాము.

ఇంటి త‌లుపు నుంచి బ‌య‌ట‌కు దూరి.. ప‌డ‌గ విప్పి బుస‌లు కొడుతూ.. ఇంట్లోకి ఎవ‌ర్నీ రాకుండా అడ్డుకుంది. ఆ పాము ప‌డ‌గను చూస్తే ఒళ్లంతా గ‌గుర్పాటుకు గురికాక త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

అయితే ఆ ఇంట్లోకి దూరిన నాగుపాము త‌లుపు వెనుకాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు య‌త్నించింది. అదే స‌మ‌యంలో త‌లుపు, ద‌ర్వాజా మ‌ధ్య ఉన్న ప్లేస్ నుంచి ప‌డ‌గ విప్పింది. బుస‌లు కొడుతున్న పామును చూసి ఆ ఇంటి వారు, స్థానికులు ప‌రుగెత్తారు. పామును వీడియో తీస్తున్న వ్య‌క్తిపై దాడి చేసేందుకు య‌త్నించింది.

ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఇంటికి కాప‌లాగా కుక్క‌ల స్థానంలో పాములు వ‌చ్చాయ‌ని జోకులు పేలుస్తున్నారు. ఆ వీడియోను చూసిన వెంట‌నే నాకు గుండెపోటు వ‌చ్చింద‌ని మ‌రికొంద‌రు కామెంట్ చేశారు. ఇంటి భ‌ద్ర‌త కోసం పాములు బెట‌రేమో అని కొంద‌రు వ్యాఖ్యానించారు.

Updated On 2 March 2023 2:14 AM GMT
subbareddy

subbareddy

Next Story