TS Wather | రాష్ట్రాన్ని చలి వణికిస్తున్నది. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో పొడివాతావరణం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోకి శీతలగాలులు వీస్తున్నాయని, దీంతో చలితీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ జారీ చేశారు. హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈశాన్య […]

TS Wather | రాష్ట్రాన్ని చలి వణికిస్తున్నది. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో పొడివాతావరణం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోకి శీతలగాలులు వీస్తున్నాయని, దీంతో చలితీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ జారీ చేశారు. హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. మరో వైపు కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 4.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 8.5 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైందని, హైదరాబాద్‌లోని చలితీవత్ర ఉందని పేర్కొంది. రాబోయే మూడు రోజులు చలిగాలులు వీస్తాయని చెప్పింది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో చలితీవత్ర ఉంటుందని పేర్కొంది. ఈ నెల 11 వరకు పొడి ఈశాన్య గాలుల కారణంగా, శీతల పరిస్థితులు నెలకొంటాయని, ఉత్తర, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 4-5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోతుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. సిర్పూర్‌ (కుమ్రంభీం) 4.7, కెరమెరి (కుమ్రంభీం) 5.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తిర్యాని (కుమ్రంభీం) 6.2, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ జన్నారం (మంచిర్యాల) 6.7, వాంకిడి (కుమ్రంభీం) 7.1, బేల (ఆదిలాబాద్‌) 7.1, ర్యాలీ (మంచిర్యాల) 7.2, శివంపేట (మెదక్‌) 7.2, బజార్‌ హత్నూర్‌ (ఆదిలాబాద్‌) 7.3, జన్నారం (మంచిర్యాల) 7.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత్రలు నమోదయ్యాయని టీఎస్‌ డీపీఎస్‌ వివరించింది.

Updated On 8 Jan 2023 5:38 AM GMT
Vineela

Vineela

Next Story