విధాత: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం సందర్శన నేపథ్యంలో అధికారులు తమకు కేటాయించిన విధులను జాగ్రత్తగా నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రపతి యాదాద్రి పుణ్యక్షేత్ర సందర్శన సందర్భంగా నిర్వహించే ఏర్పాట్లను మంగళవారం నాడు కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఆమె సమీక్షించారు. పారిశుద్ధ్య చర్యలను, బారీకేడింగ్, బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అడిషనల్ కలెక్టరు ఎం.వి.భూపాల్ రెడ్డి, DCP కె. నారాయణరెడ్డి, ఏఓ గీత, ACP కె.నర్సింహ్మరెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.ఉపేందర్ రెడ్డి, EE R&B శంకరయ్య, ఎస్.ఇ. ట్రాన్స్ కో శ్రీనాధ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జి. శ్రీనివాస్, ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి, జిల్లా సరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ చిన్ను నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానవన అధికారి అన్నపూర్ణ, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి సాహితీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, ఎస్సీ అభివృద్ధి అధికారి జయపాల్ రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్, యాదగిరిగుట్ట తాసిల్దార్ రాము, యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, కలెక్టరేట్ సూపర్ ఇంటింటి సి.ఐ. సైదయ్య తదితరులు పాల్గొన్నారు.