విధాత: సునీల్ కమెడియన్‌గా కెరీర్‌ని ప్రారంభించి, కామెడీ హీరోగా ప్రస్థానం కొనసాగించి సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేశారు. కామెడీ హీరోగా మారి అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు వంటి చిత్రాలతో విజయాలను సొంతం చేసుకున్నారు. ఏకంగా రాజమౌళి సినిమా మర్యాద రామన్నలో సునీల్ హీరోగా నటించడం అప్పట్లో పెద్ద చర్చలకే దారి తాసింది.
ఇక తడాఖా వంటి చిత్రాలలో నాగచైతన్యతో ఇతరులతో కలిసి సినిమాలు చేసి హిట్లు కొట్టిన ఆ తర్వాత మాత్రం వరుసగా ఫ్లాపులు వచ్చాయి. పూలరంగడు తర్వాత ఆ స్థాయి సక్సెస్ రాలేదు. దాంతో అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన మళ్లీ టర్న్ తీసుకున్నారు. కలర్ ఫొటో చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించారు.
రవితేజ డిస్కో రాజాలో విలన్‌గా చేశారు. అయితే పుష్పలో సునీల్ చేసిన మంగళం శీను పాత్ర అతని ఇమేజ్‌ని అమాంతం మార్చేసింది. సునీల్ పర్ఫామెన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇతర రాష్ట్రాలలో కూడా ఆయన ఇంత అద్భుతంగా విలనిజం చూపించగలడా అని అందరూ ఆశ్చర్య పోయారు. దాంతో ఆ తరహా అవకాశాలు ఇప్పుడు అక్కడ అమాంతంగా పెరిగిపోయాయి.
ఓవైపు హీరో తరహా పాత్రలతో చిన్న సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. పుష్ప క్రేజ్‌తో ఇప్పుడు సునీల్ కోలీవుడ్‌లో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న జైలర్ మూవీలో పవర్ఫుల్ విలన్ పాత్రను సునీల్ పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా లుక్ పోస్టర్ని యూనిట్ విడుదల చేసింది.
శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న మా వీరన్ సినిమాలో కూడా విలన్‌గా నటిస్తున్నారు. అలాగే కార్తీ పిరియాడికల్ కామెడీ ఎంటర్టైనర్ జపాన్‌లో కూడా సునీల్ ఇంట్రెస్టింగ్ రోల్లో కనిపించబోతున్నారు. ఇక విశాల్ హీరోగా తెరకెక్కుతున్న మార్క్ ఆంటోనీ సినిమాలో పవర్ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన లుక్కును తాజాగా విడుదల చేశారు.
పుష్పలో సునీల్ చేసిన క్యారెక్టర్ తరహాలోనే జైలర్, మార్క్ ఆంటోనీలోని అతని పాత్రలు కూడా ఉండడం విశేషం. ఈ రెండు చిత్రాలలోనూ మంగళం శీను ఛాయలు కనిపిస్తున్నాయి. ఇవి కాక కొన్ని బాలీవుడ్, కన్నడ పాన్ ఇండియా సినిమాల కోసం సునీల్‌ని విలన్ పాత్ర కోసం సంప్రదిస్తున్నారట. మొత్తానికి ఒక్క పుష్ప సినిమాతో ఇంతకాలం టాలీవుడ్‌కే పరిమితమైన సునీల్ పాన్ ఇండియా ఆర్టిస్ట్‌గా మారిపోవడం యావత్ తెలుగు ప్రజలు గర్వ పడేలా చేస్తుంది.
అయితే గతంలోను చాలామంది విలన్ పాత్రలతో ఇతర భాషల చిత్రాలలోను నటించారు. శ్రీహరి, ప్రకాశ్‌రాజ్, జగపతిబాబు వంటి వారు అన్ని భాషలలో విలన్, సహాయ పాత్రలు చేశారు. ఇప్పుడు సునీల్‌కు ఆ అవకాశం పుష్ప సినిమా ద్వారా కలిసివచ్చింది. ఇకపై సునీల్ పాన్ ఇండియా లెవల్లో ఉన్నత స్ధాయికి ఎదగాలని మనమూ కోరుకుందాం.