ఉన్నమాట: బీజేపీ రెండు సార్లు కేంద్రంలో భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎనిమిదేళ్ళ కాలంలో యూపీ, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ గట్టి పట్టు సంపాదించింది. అలాంటి బీజీపీ రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నదా? ఆ పార్టీ ప్రాభవం పతనం అవనున్నదా? అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దీనికి కారణం ప్రజలు ఇచ్చిన తీర్పును ఎనిమిదేళ్ల కాలంలో అపహాస్యం చేస్తూ రావడం.. కేంద్రంలో అధికారంలో ఉన్నాం […]

ఉన్నమాట: బీజేపీ రెండు సార్లు కేంద్రంలో భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎనిమిదేళ్ళ కాలంలో యూపీ, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ గట్టి పట్టు సంపాదించింది. అలాంటి బీజీపీ రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నదా? ఆ పార్టీ ప్రాభవం పతనం అవనున్నదా? అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

దీనికి కారణం ప్రజలు ఇచ్చిన తీర్పును ఎనిమిదేళ్ల కాలంలో అపహాస్యం చేస్తూ రావడం.. కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి బలం లేకున్నా.. ప్రలోభ పెట్టో, కుదరక పోతే ఐటీ, సీబీఐ, ఈడీ దాడుల బెదిరింపులకు పాల్పడుతున్నదనే విపక్షాల ఆరోపణలు వాస్తవం అని ఈ మధ్య కాలంలో తేటతెల్లం అవుతున్నది.

అంతేకాదు ప్రజల ఆశీర్వాదంతో అవకాశం ఇస్తే అభ్యంతరం లేదు. కానీ మెజార్టీ లేకున్నా ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పాలన చేస్తూ.. ఎవరి మద్దతుతో అధికారంలో ఉన్నారో ఆ పార్టీలనే చీల్చే ప్రయత్నం చేస్తున్నది. దీనికి మహారాష్ట్రనే పెద్ద ఉదాహరణ. బీహార్‌లోనూ అదే పని చేయాలని చూసింది.

మహారాష్ట్ర పరిణామాల తర్వాత ఆ రాష్ట్ర సీఎం నితీశ్ బీజేపీతో తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చింది. మా అధికార దాహానికి అంతే లేదు అన్నట్లు ఈ ఎనిమిదేళ్ళ కాలంలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన అపకీర్తిని కమలం పార్టీ మూటకట్టుకున్నది. ఫలితంగా ప్రాంతీయ పార్టీలు మనుగడ పోరాటం చేయల్సిన పరిస్థితి కల్పించింది.

వీటన్నటితో పాటు కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీ పెద్దలు పిలుపు నిచ్చినంత మాత్రానా అది ఆచరణ సాధ్యం కాదని ప్రజలు ఈ ఎనిమిదేళ్ళ కాలంలో అనేక సార్లు తమ తీర్పు ద్వారా నిరూపించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో జోష్ పెంచడమే కాదు, ప్రజల నుంచి కూడా వస్తున్న స్పందన చూస్తుంటే.. కమలం ముక్త్ భారత్ అవుతుందా అన్నట్టు ఉన్నది.

అలాగే ఆప్ ఢిల్లీ నుంచి పంజాబ్‌లో పాగా వేసింది. ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. ఇక బీజేపీ ఎనిమిది రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలను అస్థిర పరిచిన్నట్లు తెలంగాణలోనూ అదే ప్రయత్నం చేయబోయి ప్రస్తుతం కేసీఆర్ వ్యూహంలో చిక్కుకున్నది.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తమకు సంబంధం లేదంటూనే ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్‌పై చేస్తున్న ఎదురు దాడి చూస్తుంటే .. ఏదో తేడా కొడుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ పరిణామాలన్నీ కమలం పార్టీ కి రానున్న రోజుల్లో కష్టాలను తెచ్చేవే. - Raju Asari

Updated On 31 Oct 2022 3:20 AM GMT
krs

krs

Next Story