Uttam Kumar Reddy |
ప్రజాపక్ష పోరాటాల్లో కమ్యూనిస్టులదే ముందడుగు: సిపిఐ నేతలు నారాయణ , చాడ, కూనంనేని
విధాత: పేదలు, అణగారిన వర్గాలు, కార్మికులు, భూమిలేని పేదలు, రైతు కూలీల పక్షాన కమ్యూనిస్టులు సాగించిన నిస్వార్ధ పోరాటాల చరిత్ర స్ఫూర్తిదాయకమని పిసిసి మాజీ చీఫ్, ఎంపి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెంలో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు, దివంగత వీరారెడ్డి విగ్రహావిష్కరణకు ఉత్తమ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జిల్లా ప్రాంతంలోని పేదలకు, కార్మికులకు దివంగత వీరారెడ్డి జీవితాంతం అంకితభావంతో చేసిన సేవను కొనియాడారు. జాతీయ, రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు కె. నారాయణ, చాడ వెంకట రెడ్డి, రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కూనమనేని సాంబశివరావులు ప్రసంగించారు.
కమ్యూనిస్టు పార్టీ సాగించిన ప్రజాపక్ష పోరాటాలలో వీరారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. వీరారెడ్డి స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అన్నారు. పాలకవర్గాలు అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించడంలో కమ్యూనిస్టులు ముందుంటారన్నారు. కాగా కాంగ్రెస్ కీలక నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిపిఐ నేతలు నారాయణ, చాడ, కూనంనేనిలు ఒకే వేదికపై కనిపించడం రాజకీయంగా ఆసక్తి రేపింది.
కార్యక్రమంలో పల్లా వెంకట్ రెడ్డి , బొమ్మగాని ప్రభాకర్ , పశ్య పద్మ, గన్న చంద్రశేఖర్, బెజవాడ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్తేల నారాయణరెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి చింతిరాల రవి, దొంగల అంకరాజు, జలాలుద్దీన్, చిత్తలూరు వీరబాబు, భాష గోనె అంకయ్య,రామారావు, తాళ్లూరు శీను, వెంకటరెడ్డి, మంగయ్య ,గంధం కొండ చింతల కొండ శ్రీను, అంజి, తోకల సైదు,లు బ్రహ్మం, వెంకటరెడ్డి, సత్యం, పద్మ, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.