విధాత: ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్- ఆస్ట్రేలియా మూడో టీ-20 మ్యాచ్ కు సంబంధించి టికెట్ల విషయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై బీసీ రాజకీయ ఐకాస ఛైర్మన్ యుగంధర్ గౌడ్ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. టికెట్ల విక్రయానికి HCAకు సంబంధం లేదు టికెట్ల విక్రయానికి హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని అజారుద్దీన్ తెలిపారు. టికెట్ల విక్రయ బాధ్యత పేటీఎంకు అప్పగించాం. […]

విధాత: ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్- ఆస్ట్రేలియా మూడో టీ-20 మ్యాచ్ కు సంబంధించి టికెట్ల విషయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై బీసీ రాజకీయ ఐకాస ఛైర్మన్ యుగంధర్ గౌడ్ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
టికెట్ల విక్రయానికి HCAకు సంబంధం లేదు
టికెట్ల విక్రయానికి హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని అజారుద్దీన్ తెలిపారు. టికెట్ల విక్రయ బాధ్యత పేటీఎంకు అప్పగించాం. టికెట్లు బ్లాక్‌లో అమ్మలేదన్నారు. బ్లాక్‌లోటికెట్లు అమ్మినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు.
హెచ్‌సీఏలో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని, అయితే మ్యాచ్ విజయవంతం కోసం కృషి చేస్తున్నామని విజయానంద్ అన్నారు. టికెట్ల గందరగోళంపై హెచ్‌సీఏ కమిటీ వేస్తున్నది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఉన్నదన్నారు.
