Cheruku Suhas complaint.. MP Venkata Reddy.. Human Rights Commission
విధాత: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(MP KomatireddyVenkata Reddy) ఫోన్ చేసి డాక్టర్ చెరుకు సుధాకర్(Cheruku Sudhkar)ను, కుమారుడైన డాక్టర్ చెరుకు సుహాస్(Cheruku Suhas)ను చంపేస్తామని బెదిరించిన వివాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(Human Rights Commission)కు శుక్రవారం చెరుకు సుహాస్ ఫిర్యాదు చేశారు.
కోమటిరెడ్డి పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని, చిన్న కేసుగా నమోదు చేశారన్నారు. అందుకే మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశానన్నారు. మానవ హక్కుల కమిషన్ వెంటనే కోమటిరెడ్డి పై చర్యలు తీసుకోవాలన్నారు. మా ఫ్యామిలీకి భద్రత కల్పించాలని కోరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పోలీస్ దర్యాప్తును ముందుకు సాగకుండా ఒత్తిడి చేస్తున్నారన్నారు.
ఫోన్లో తమను వెంకటరెడ్డి బెదిరిస్తూ మాట్లాడిన సందర్భంలో 100 కార్లలో వంద మంది తమను చంపడానికి ఆయన మనుషులు బయలుదేరారని చెప్పారని, వారు ఎవరో ఎక్కడున్నారో విచారణ చేయాలన్నారు. మా హాస్పిటల్ కూల్చివేస్తామని బెదిరించారన్నారు. వెంకట్ రెడ్డి తమను బెదిరించిన ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను కమిషన్‌కు అందించామని సుహాస్ తెలిపారు