HomelatestKarnataka Congress | బంప‌ర్‌ మెజార్టీ దిశ‌గా కాంగ్రెస్ దూకుడు

Karnataka Congress | బంప‌ర్‌ మెజార్టీ దిశ‌గా కాంగ్రెస్ దూకుడు

Karnataka Congress |

  • 121స్థానాల్లో హ‌స్తం హ‌వా.. 75 ద‌గ్గ‌రే క‌మ‌లం కుదేలు!

విధాత‌: క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాతున్న‌ది. బంప‌ర్‌మెజార్టీ దిశ‌గా కాంగ్రెస్‌పార్టీ దూసుకెళ్తున్న‌ది. అధికారాన్ని చేప‌ట్ట‌డానికి అవ‌స‌ర‌మైన మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటేసింది. అనేప‌థ్యంలో ఎమ్మెల్యేలు అంద‌రూ బెంగ‌ళూరు చేరుకోవాల‌ని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.

కాంగ్రెస్ పార్టీ 120 మార్కును దాటడం ఖాయమని సిద్ధరామయ్య అన్నారు. పార్టీ తన ఎమ్మెల్యేల‌ను క్యాంపుల్లో ఉంచడానికి అనేక రిసార్ట్‌లను బుక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాంగ్రెస్ “తన ఎమ్మెల్యేలను కూడా విశ్వసించదు” అని ఆరోపించింది.

కాంగ్రెస్ గెలుపు బాట మొద‌లైంది..

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ గెలుపు బాట ప్రారంభ‌మైంది. ఇప్పటికే మూడు స్థానాల్లో గెలిచింది. భాజపా, జేడీఎస్‌లు ఒక్కో స్థానంలో గెలుపొందాయి. మరోవైపు కాంగ్రెస్‌ 117, బీజేపీ 68, జేడీఎస్‌ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మొలకల్మూరులో, హరియూర్‌లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు గోపాలకృష్ణ, సుధాకర్‌ గెలుపొందారు.

బంగారప్ప vs బంగారప్ప

శివమొగ్గ జిల్లా సొరబలో అన్నదమ్ముల పోరులో కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు మధు బంగారప్ప విజయపథంలో దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయన అన్న కుమార్ బంగారప్ప 20,621 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్కమగళూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెనుకంజలో ఉన్నారు. కొడగు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఇటీవలి సంవత్సరాలలో తొలిసారిగా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న‌ది.

11.30 గంట‌ల స‌మ‌యానికి కాంగ్రెస్‌ పార్టీ 121 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న‌ది. బీజేపీ ఆధిక్యం 71కి పడిపోయిం

11.04 గంట‌లు: గాంధీనగర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలుత వెనుకబడిన కాంగ్రెస్ నాయకుడు దినేశ్‌ గుండూరావు ఇప్పుడు ఆధిక్యంలో ఉన్నారు.

10.59 గంట‌లు: కర్ణాటక ముఖ్య‌మంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి భారీ ఆధిక్యంలో ఉన్నారు

10.53 గంట‌లు: కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మార్కును దాట‌డానికి దగ్గరగా ఉన్నందున ఆ పార్టీ నాయకుడు & మాజీ సీఎం సిద్ధరామయ్య గెలుపు చిహ్నం చూపించారు.

10.43 గంట‌లు: బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన లక్ష్మణ్ సవాడి అథని నియోజ‌క‌వ‌ర్గంలో ముందంజలో ఉన్నారు.

10.39 గంట‌లు: మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. శివమొగ్గ జిల్లాలోని ఏడు స్థానాల‌కుగాను ఐదు స్థానాల్లో బీజేపీ వెనుకంజలో ఉన్న‌ది.

10.32 గంట‌లు: 8వ రౌండ్ కౌంటింగ్ తర్వాత బీజేపీ అభ్యర్థి మహేశ్ టెంగింకైపై జగదీశ్‌ షెట్టర్ 11,000 ఓట్లకు పైగా వెనుకబడ్డారు.

10.23 గంట‌లు: మైసూరు జిల్లా వరుణ నియోజ‌క‌వ‌ర్గంలో ముందంజలో ఉన్న సిద్ధరామయ్య తన ఇంటి నుంచి కౌంటింగ్ కేంద్రానికి బయలుదేరారు.

10.14 గంట‌లు: కాంగ్రెస్ ఇప్పుడు సగానికి పైగా మార్కును దాటింది. హ‌స్తం పార్టీ 114 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్కు 113 కంటే ఎక్కువగా ఉండగలిగింది. బీజేపీ 77 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న‌ది.

10.08 గంట‌లు: శివమొగ్గలో బీజేపీ 15,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్న‌ది. అక్కడ పార్టీ ప్రముఖ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప మెజార్టీలో ముందంజ‌లో ఉన్నారు.

10.02 గంట‌లు కుమారస్వామి తండ్రీ కొడుకులు ముందంజలో ఉన్నారు. హెచ్‌డి కుమారస్వామి, కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఇద్దరూ తమ తమ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

9.59 గంట‌లు: 2004లో ఒక ఓటు తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఏఆర్ కృష్ణమూర్తి చామరాజనగర్ జిల్లాలోని కొల్లేగల్ రిజర్వ్ సెగ్మెంట్‌లో విజయపథంలో దూసుకుపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బీజేపీ ప్రత్యర్థి మహేశ్‌పై ఆయన 17,699 ఆధిక్యంలో ఉన్నారు.

9.55 గంట‌లు: ఈసీ విడుదల చేసిన అధికారిక ఫ‌లితాల్లో కాంగ్రెస్ ముందంజ‌లో దూసుకెళ్తున్న‌ది.
180 స్థానాలకు కాంగ్రెస్ 96, బీజేపీ 61 , జేడీఎస్ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

9.51 గంట‌లు: కనకపుర నుంచి డీకే శివకుమార్ ఆధిక్యంలో ఉన్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన శివ‌కుమార్ సీఎం పదవికి గట్టి పోటీదారుగా ఉన్నారు.

9.47 గంట‌లు: కాంగ్రెస్ ఆధిక్యం తగ్గింది. ప్రస్తుతం ఆ పార్టీ 113 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న‌ది. బీజేపీ 83 స్థానాల్లో, జేడీ(ఎస్) 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న‌ది.

9.41 గంట‌లు: మాండ్య జిల్లాలోని మలవల్లిలో కాంగ్రెస్‌పై జేడీ(ఎస్) 187 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ముందంజలో ఉన్న‌ది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular