Congress కొత్తగా ఎవరూ కలిసిరానక్కర్లేదు కాంగ్రెస్‌తోనే డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, జేడీయూ, కొన్ని చిన్న పార్టీలు కూడా బీజేపీని 350 సీట్లలో అవి నిలువరించగల స్థితి కాంగ్రెస్‌కు 200 స్థానాల్లో సొంత బలం వాటిలో ఎక్కువ స్థానాలు గెలిస్తే చాలు విధాత: దేశంలో బీజేపీతో కాంగ్రెస్‌ తలపడగలుగుతుందా? నరేంద్రమోడీని రాహుల్‌గాంధీ ఢీ కొట్టగలుగుతారా? ఇప్పుడు అనేక మందిని తొలుస్తున్న ప్రశ్న. దేశంలో మార్పు రావాలన్న బలమైన ఆకాంక్షల నుంచి ఈ సందేహాలు తలెత్తుతున్నాయి. అధికార పక్షం […]

Congress

  • కొత్తగా ఎవరూ కలిసిరానక్కర్లేదు
  • కాంగ్రెస్‌తోనే డీఎంకే, ఎన్సీపీ, శివసేన,
  • ఆర్జేడీ, జేడీయూ, కొన్ని చిన్న పార్టీలు కూడా
  • బీజేపీని 350 సీట్లలో అవి నిలువరించగల స్థితి
  • కాంగ్రెస్‌కు 200 స్థానాల్లో సొంత బలం
  • వాటిలో ఎక్కువ స్థానాలు గెలిస్తే చాలు

విధాత: దేశంలో బీజేపీతో కాంగ్రెస్‌ తలపడగలుగుతుందా? నరేంద్రమోడీని రాహుల్‌గాంధీ ఢీ కొట్టగలుగుతారా? ఇప్పుడు అనేక మందిని తొలుస్తున్న ప్రశ్న. దేశంలో మార్పు రావాలన్న బలమైన ఆకాంక్షల నుంచి ఈ సందేహాలు తలెత్తుతున్నాయి. అధికార పక్షం ప్రచారం చేసినంతగా కాంగ్రెస్‌ బలహీన పడిపోలేదు. బీజేపీని ఢీ కొట్టడానికి కాంగ్రెస్‌, ప్రస్తుతం ఆ పార్టీతో కలసి ప్రయాణిస్తున్న మిత్రపక్షాలు చాలు. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు కలిసి పదిహేడు రాష్ట్రాలలోని 350 లోక్‌సభ నియోజకవర్గాలలో బీజేపీతో ఢీ అంటే ఢీ అని కొట్లాడే పరిస్థితుల్లో ఉన్నాయి.

అనేక రాష్ట్రాల్లో బలంగా కాంగ్రెస్‌, మిత్రపక్షాలు

కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, బీహార్‌, అస్సాంలతోపాటు మరో ఏడెనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు, చిన్నరాష్ట్రాలలో కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు బలంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నింటా కలిపి 350 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌తో డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, జేడీయూ, మరికొన్ని చిన్న పార్టీలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయి.

బెంగాల్‌లో పొత్తు కలుస్తుందా?

ఒడిశా, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌లు మాత్రమే ఇందుకు మినహాయింపు. అక్కడ కాంగ్రెస్‌కు పొత్తులు సాధ్యమవుతాయా? లేక ఒంటరి పోరాటం చేయవలసి వస్తుందా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లో రెండు స్థానాలు గెల్చుకుంది. ఒడిశాలో ఒక స్థానం గెల్చుకుంది. కాంగ్రెస్‌ గత లోక్‌సభ ఎన్నికల్లో 421 స్థానాల్లో పోటీచేసి 52 స్థానాలను మాత్రమే గెల్చుకుంది. మరో 220 స్థానాల్లో బలమైన ప్రత్యర్థిగా బీజేపీ, ఇతరపక్షాలతో ముఖామఖి తలపడింది.

ఆ 200 స్థానాల్లో కాంగ్రెస్‌ సొంతగా పోటీ

కేరళ, కర్ణాటక, గుజరాత్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, అస్సాం, తెలంగాణ రాష్ట్రాలలోని సుమారు 200కు పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ సొంతంగా పోటీచేస్తుంది. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెల్చుకుంది. చాలా రాష్ట్రాల్లో 90 శాతం స్థానాలను గెల్చుకుంది. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనూ అటువంటి పరిస్థితి లేదని ఎన్నికల పండితులు చెబుతున్నారు.

పడిపోయిన మోడీ గ్రాఫ్‌

ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్ఠ బాగా పడిపోయిందని, భారత్‌ జోడో యాత్ర తర్వాత రాహుల్‌గాంధీ ప్రతిష్ఠ పెరిగిందని వారు అంచనా వేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఈ వాదనను రుజువు చేస్తున్నాయని వారు భావిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రజాదరణ తగ్గలేదని ప్రకటిస్తూ కర్ణాటక ఎన్నికలకు ముందు వచ్చిన సర్వేలన్నీ ఉద్దేశపూర్వకంగా వండివార్చినవేనని ఎన్నికల పండితులు చెబుతున్నారు.

కృత్రిమ సర్వేల్లో బీజేపీ

సరిగ్గా పది మాసాల తర్వాత ఎన్నికలు జరుగనున్నందన ఇప్పటి నుంచి అధికారంలో ఉన్న వారు కృత్రిమ సర్వేలు విడుదల చేయిస్తూనే ఉంటారని వారు చెబుతున్నారు. కాంగ్రెస్‌ నాయకత్వం కర్ణాటక తరహాలో సంఘటితంగా, క్రియాశీలకంగా పనిచేస్తే పై రాష్ట్రాలన్నింటా మంచి ఫలితాలు సాధించవచ్చునని మధ్య భారత రాష్ట్రాల్లో ఎన్నికల సర్వేలు చేస్తున్న ఒక ఎన్నికల నిపుణుడు వ్యాఖ్యానించారు.

దేశంలో అన్నివర్గాలు మార్పును కోరుకుంటున్నాయని ఆయన అన్నారు. మిత్రపక్షాలతో కలిసి బలంగా ఉన్న 350తోపాటు.. సొంతగా బలం ఉన్న 200 స్థానాలపై దృష్టిసారిస్తే.. కాంగ్రెస్‌తో కొత్తగా ఎవరూ కలిసి రావాల్సిన అవసరం లేదని ఆయన అంచనా వేశారు.

Updated On 19 May 2023 12:37 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story