విధాత, మంత్రి జి.జగదీష్ రెడ్డి రాజకీయ చాణక్యం ధాటికి కొనసాగుతున్న వలసల పర్వంతో సూర్యాపేటలో ప్రతిపక్షాలు నానాటికి బలహీనమవుతున్నాయి. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్ బీఆర్ఎస్‌లో చేరిపోగా, శుక్రవారం కాంగ్రెస్‌కే చెందిన మరో కౌన్సిలర్ కొండపల్లి భద్రమ్మ సాగర్ రెడ్డిలు హైదరాబాద్‌లో మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో INTUC జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి సాగర్ రెడ్డి, జాతీయ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే రషీద్, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, పట్టణ నాయకులు జమాల్ బాబా, పుట్ట రవీందర్ రెడ్డి, అమర్నాథరెడ్డిలు ఉన్నారు.
సూర్యాపేటలో కాంగ్రెస్ ఖాళీ అవుతుంది.. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన విక్రమ్ చేరిక ను మరువక ముందే మరో కౌన్సిలర్ కొండపల్లి భద్రమ్మ సాగర్ రెడ్డి లు హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షం లో బీఆర్ఎస్ లో చేరారు. pic.twitter.com/kXcOWGVPvN
— Jagadish Reddy G (@jagadishBRS) February 24, 2023
త్వరలోనే వీరి బాటలో మరింత మంది కాంగ్రెస్ , బీజేపీ కౌన్సిలర్లు, ఆ పార్టీల నాయకులు బీఆర్ఎస్‌లో చేరికకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కౌన్సిలర్లు జహీర్, మడిపల్లి విక్రమ్, నాయకులు బైరు వెంకన్న, గుడిపుడి వెంకటేశ్వర రావు, సయ్యద్ సలీం, మీలా వంశీ, బైరబోయిన శ్రీనివాస్, పల్స వెంకన్న తదితరులు పాల్గొన్నారు