Punjab ఇంట్లో ఉండగా, ఇద్దరు అగంతకుల దుశ్చర్య బాధ్యత వహించిన ఖలిస్తానీ ఉగ్రవాది విధాత: పంజాబ్‌లోని మోగా జిల్లాలో కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ బల్జీందర్ సింగ్ బల్లిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. సోమవారం తన నివాసంలోకి చొరబడిన ఇద్దరు సమీపం నుంచి తుపాకీతో కాల్చారు. తీవ్రంగా గాయపడిన బల్జీందర్ సింగ్ దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ హత్యకు తానే బాధ్యుడనని కెనడాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ డల్లా సోషల్ మీడియాలో వెల్లడించారు. బల్జీందర్ […]

Punjab
- ఇంట్లో ఉండగా, ఇద్దరు అగంతకుల దుశ్చర్య
- బాధ్యత వహించిన ఖలిస్తానీ ఉగ్రవాది
విధాత: పంజాబ్‌లోని మోగా జిల్లాలో కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ బల్జీందర్ సింగ్ బల్లిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. సోమవారం తన నివాసంలోకి చొరబడిన ఇద్దరు సమీపం నుంచి తుపాకీతో కాల్చారు. తీవ్రంగా గాయపడిన బల్జీందర్ సింగ్ దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ హత్యకు తానే బాధ్యుడనని కెనడాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ డల్లా సోషల్ మీడియాలో వెల్లడించారు.
బల్జీందర్ సింగ్ బల్లి తన ఇంట్లో సోమవారం క్షవరం చేయించుకుంటుండగా, గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతడిని కలిసేందుకు బయటకు వస్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతి సమీపం నుంచి కాల్చారు. అనంతరం బైక్‌పై పారిపోయారు. దాడి తర్వాత దుండగులు పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన బల్జీందర్ సింగ్‌ను సమీప దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.
బల్జీందర్ సింగ్ హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటనకు తానే బాధ్యుడనని కెనడాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ డల్లా ఫేస్‌బుక్ పోస్ట్ పోస్టు పెట్టాడు. బల్జిందర్ సింగ్ బల్లి తన భవిష్యత్తును నాశనం చేశాడని, తనను గ్యాంగ్‌స్టర్ సంస్కృతిలోకి నెట్టాడని డల్లా తన పోస్ట్‌లో ఆరోపించాడు. తన తల్లి పోలీసు కస్టడీ వెనుక బల్జీందర్ సింగ్ హస్తం ఉన్నదని, ఇది ప్రతీకారం తీర్చుకొనేలా ప్రేరేపించిందని వెల్లడించారు.
నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (NIA) వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో అర్ష్ డల్లా కూడా ఉన్నారు. మూడు, నాలుగేండ్లుగా కెనడా నుంచే అతడు ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. పంజాబ్‌లో పలు ఉగ్రవాద హత్యలకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
