- 59వ వర్ధంతి సందర్భంగా
- ఢిల్లీలోని శాంతివనంలో
- కాంగ్రెస్ నేతల పుష్పాంజలి
విధాత: భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 59వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ (Congress) కమిటీ ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలోని శాంతివనంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు పుష్పాంజలి ఘటించారు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాన పాత్ర పోషించారు. 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 16 సంవత్సరాలపాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన నెహ్రూ.. అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. 1964 మే 27న గుండెపోటు కారణంగా ఆయన కన్నుమూశారు.
పిల్లలను అధికంగా ప్రేమించే ఆయన చాచా నెహ్రూ గా ఖ్యాతి పొందారు. నెహ్రూ పుట్టిన రోజు అయిన నవంబర్ 14వ తేదీని జాతీయ చిల్డ్రన్స్ డేగా నిర్వహిస్తున్నారు.