రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల‌ను అరెస్టులు, గృహ‌ నింర్భంధాల‌తో క‌ట్ట‌డి చేసిన పోలీసులు విధాత‌: తెలంగాణ గ్రామ స‌ర్పంచుల‌కు మ‌ద్ధ‌తుగా కాంగ్రెస్ త‌ల‌పెట్టిన ధ‌ర్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. తెలంగాణ‌లో గ్రామ‌పంచాయ‌తీల‌కు కేటాయించిన నిధుల‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం దారి మ‌ళ్లిస్తున్న‌తీరును నిర‌సిస్తూ రాజీవ్ గాంధీ పంచ‌య‌తీరాజ్ సంఘ‌ట‌న్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేత‌ల‌ను ఎక్క‌డివారిని అక్క‌డ అరెస్టులు, గృహ‌నిర్బంధాలకు గురి చేశారు. స‌ర్పంచుల‌కు మ‌ద్ధ‌తుగా కాంగ్రెస్ చేప‌ట్టిన […]

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల‌ను అరెస్టులు, గృహ‌ నింర్భంధాల‌తో క‌ట్ట‌డి చేసిన పోలీసులు

విధాత‌: తెలంగాణ గ్రామ స‌ర్పంచుల‌కు మ‌ద్ధ‌తుగా కాంగ్రెస్ త‌ల‌పెట్టిన ధ‌ర్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. తెలంగాణ‌లో గ్రామ‌పంచాయ‌తీల‌కు కేటాయించిన నిధుల‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం దారి మ‌ళ్లిస్తున్న‌తీరును నిర‌సిస్తూ రాజీవ్ గాంధీ పంచ‌య‌తీరాజ్ సంఘ‌ట‌న్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేత‌ల‌ను ఎక్క‌డివారిని అక్క‌డ అరెస్టులు, గృహ‌నిర్బంధాలకు గురి చేశారు.

స‌ర్పంచుల‌కు మ‌ద్ధ‌తుగా కాంగ్రెస్ చేప‌ట్టిన ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్ ధ‌ర్నాచౌక్‌, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌, గాంధీ భ‌వ‌న్ ప‌రిస‌రాల్లో తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి. పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని త‌న ఇంటినుంచి కాలు బ‌య‌ట పెట్ట‌గానే పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

అలాగే.. ధ‌ర్నా చౌక్ ద‌గ్గ‌ర ఉన్న నేత‌ల‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అక్క‌డ గుమికూడిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు చెద‌ర‌గొట్టారు. నాంపెల్లిలోని గాంధీ భ‌వ‌న్ ద‌గ్గ‌ర కూడా తీవ్ర ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. వంద‌ల సంఖ్య‌లో పోలీసులు గాంధీ భ‌వ‌న్‌ను చుట్టుముట్టి నిర్బంధించారు. అయితే కాంగ్రెస్ పిలుపులో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు రోడ్ల‌మీదికి వ‌చ్చి బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు.

వరంగల్: బిల్లులు రాక ఉప సర్పంచ్ ఆత్మహత్య

కేసీఆర్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గ్రామ పంచాయ‌తీలు అభివృద్ధిలో వెనుక‌బ‌డ్డాయ‌ని, దానికి కార‌ణం రాష్ట్ర‌ప్ర‌భుత్వ‌మేన‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. గ్రామ‌పంచాయితీల‌కు కేటాయించిన 35వేల కోట్ల రూపాయ‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం దొంగిలించింద‌ని ఆయ‌న ఆరోపించారు.

తాము చేసిన అభివృద్ధి ప‌నుల‌కు వెచ్చించిన డబ్బుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవ్వ‌క పోవ‌టం కార‌ణంగా ఇప్ప‌టికే అనేక మంది స‌ర్పంచ్‌లు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. అభివృద్ధిప‌నులు చేయ‌మంటారు.., చేస్తే బిల్లులు ఇవ్వ‌కుండా స‌తాయిస్తారు.. ఇంత‌క‌న్నా రాక్ష‌స‌త్వం ఉంటుందా అని రేవంత్ విమ‌ర్శించారు.

ఒక ప్ర‌జాప్ర‌తినిధిగా తాను త‌న నియోజ‌క వ‌ర్గంలో తిరిగే స్వేచ్ఛ నాకు లేదా అని ప్ర‌శ్నించారు. ఇంటినుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌నే హ‌క్కు పోలీసుల‌కు ఎక్క‌డిద‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ త‌న నియంతృత్వ విధానాల‌ను వ‌దులుకోక పోతే ప్ర‌జ‌లే ఆయ‌న‌ను వ‌దులుకొనే రోజు వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

గ్రామ పంచాయితీల అభివృద్ధికోసం కేటాయించిన నిధుల‌ను ఇత‌ర ప‌థ‌కాల‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం దారి మ‌ల్లిస్తున్న‌ద‌ని కాంగ్రెస్ నేత అద్దంకి ద‌యాక‌ర్ విమ‌ర్శించారు. కేసీఆర్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న అప్ర‌జాస్వామిక విధానాల‌ను ఎండ‌గ‌ట్ట‌ట‌మే ల‌క్ష్య‌మ‌ని మ‌ల్లు ర‌వి అన్నారు. సర్పంచుల‌కు మ‌ద్ద‌తుగా ఆందోళ‌న‌కు బ‌య‌లు దేరిన‌ కాంగ్రెస్ కార్పొరేట‌ర్ విజ‌యారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

Updated On 2 Jan 2023 10:14 AM GMT
krs

krs

Next Story