Congress | ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తొలి జాబితాలో 4న హైదరాబాద్‌కు స్క్రీనింగ్‌ కమిటీ హైదరాబాద్‌లో సీడబ్ల్యుసీ భేటీ ఏఐసీసీకి విజ్ఞప్తి చేస్తూ లేఖ 119 సీట్లకు 1006 దరఖాస్తులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వెల్లడి విధాత, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తొలి జాబితాలోనే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన ఎన్నికల కమిటీ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. అనంతరం సమావేశ వివరాలను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ […]

Congress |

  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తొలి జాబితాలో
  • 4న హైదరాబాద్‌కు స్క్రీనింగ్‌ కమిటీ
  • హైదరాబాద్‌లో సీడబ్ల్యుసీ భేటీ
  • ఏఐసీసీకి విజ్ఞప్తి చేస్తూ లేఖ
  • 119 సీట్లకు 1006 దరఖాస్తులు
  • మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వెల్లడి

విధాత, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తొలి జాబితాలోనే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన ఎన్నికల కమిటీ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. అనంతరం సమావేశ వివరాలను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ మీడియాకు వెల్లడించారు. 119 నియోజకవర్గాల నుండి 1006 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అత్యధికంగా ఇల్లందు నియోజకవర్గం నుంచి రాగా.. కొడంగల్, జగిత్యాల నుంచి ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చినట్టు వెల్లడించారు.

అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న నేతలకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం, పార్టీలో చేరిన తేదీ, దరఖాస్తు చేసుకున్న తేదీ, పాల్గొన్న పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వాళ్లు చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు, దరఖాస్తులో పొందుపరచిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. ఈ చర్చల సారాంశాన్ని నివేదికలుగా రూపొందిస్తామని తెలిపారు. వీటిని సెప్టెంబర్ 2 గాంధీ భవన్‌లో నిర్వహించే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు.

సెప్టెంబర్ 4న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌ మురళీధరన్, సభ్యులు బాబా సిద్ధికి, జిగ్నేష్ మేవాని హైదరాబాద్ వస్తారని, 3 రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండి రాష్ట్రంలోని అన్ని రకాల నాయకత్వంతో మాట్లాడి నివేదికలు తయారు చేస్తారని తెలిపారు. ఈ పక్రియ అంతా పది రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. సీడబ్ల్యూసీ సమావేశం ఇంత వరకు హైదరాబాద్‌లో ఎన్నడూ నిర్వహించలేదు.

ఎన్నికల నేపథ్యంలో తొలిసారి సీడబ్ల్యూసీ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాయాలని తీర్మానించినట్టు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు రేణుకా చౌదరి, జానారెడ్డి, వీ హన్మంతరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బలరాంనాయక్‌, జీవన్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వంశీచంద్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మహేశ్‌ కుమార్‌గౌడ్‌ తదితర నేతలు పాల్గొన్నారు.

Updated On 29 Aug 2023 5:07 PM GMT
krs

krs

Next Story