విధాత: కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) ఎవరు అనే ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ అధిష్ఠానం ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నది. కర్ణాటక తదుపరి సీఎంగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ ఖరారుచేసింది.
సిద్ధరామయ్యను సీఎంగా పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్టు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ పేరును ప్రకటించారు. డీకే డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడిగానూ కొనసాగుతారని వేణుగోపాల్ వెల్లడించారు.