విధాత, హైదరాబాద్: వ్యాయమం చేస్తూ ఉన్నపళంగా కుప్పకూలి చనిపోతున్న ఉదంతాలు అనేకం ఇటీవల కాలంలో చాలా జరిగాయి. కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్, ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కూడా వ్యాయమం చేస్తూ పడిపోయిన ఘటనలు చూశాం.
అలాంటి ఘటనే ఆసిఫ్‌నగర్ పరిధిలో జరిగింది. ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న బోయిన్‌పల్లికి చెందిన 24 ఏండ్ల యువ పోలీస్ కానిస్టేబుల్ విశాల్ జిమ్ చేస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు.
వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. పుషప్స్ చేసిన తర్వాత ఆయన పడిపోయిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.
View this post on Instagram