విధాత : ఓ పోలీసు కానిస్టేబుల్ దొంగ‌గా మారాడు. విధులు నిర్వ‌ర్తిస్తూనే క‌రెంట్ బ‌ల్బ్‌ను దొంగిలించాడు. ఈ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌యాగ్‌రాజ్‌లోని ఫూల్‌పుర్ పోలీసు స్టేష‌న్‌లో రాజేశ్ వ‌ర్మ కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. అయితే అక్టోబ‌ర్ 6వ తేదీన రాజేశ్‌కు నైట్ డ్యూటీ విధించారు. డ్యూటీలో భాగంగా స్థానికంగా ఉన్న రోడ్ల‌పై గ‌స్తీ నిర్వ‌హించాడు. అయితే ఓ […]

విధాత : ఓ పోలీసు కానిస్టేబుల్ దొంగ‌గా మారాడు. విధులు నిర్వ‌ర్తిస్తూనే క‌రెంట్ బ‌ల్బ్‌ను దొంగిలించాడు. ఈ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.


వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌యాగ్‌రాజ్‌లోని ఫూల్‌పుర్ పోలీసు స్టేష‌న్‌లో రాజేశ్ వ‌ర్మ కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. అయితే అక్టోబ‌ర్ 6వ తేదీన రాజేశ్‌కు నైట్ డ్యూటీ విధించారు. డ్యూటీలో భాగంగా స్థానికంగా ఉన్న రోడ్ల‌పై గ‌స్తీ నిర్వ‌హించాడు. అయితే ఓ దుకాణం వ‌ద్ద ఉన్న బ‌ల్బ్‌ను కానిస్టేబుల్ తీశాడు. దాన్ని జేబులో వేసుకుని అక్క‌డ్నుంచి వెళ్లిపోయాడు.


అయితే మ‌రుస‌టి రోజు దుకాణ య‌జ‌మాని వ‌చ్చి చూడ‌గా క‌రెంట్ బ‌ల్బ్ క‌నిపించ‌లేదు. ఇక సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించ‌గా, కానిస్టేబుల్ బ‌ల్బ్‌ను దొంగిలించిన‌ట్లు క‌నిపించింది. ఈ విష‌యాన్ని ఫూల్‌పుర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలించ‌గా, రాజేశ్ వ‌ర్మ‌నే బ‌ల్బ్ తీసిన‌ట్లు తేలింది. దీంతో అత‌న్ని విధుల నుంచి తొల‌గించారు.


ఈ ఘ‌ట‌న‌పై రాజేశ్ వ‌ర్మ స్పందించారు. నైట్ డ్యూటీలో తాను ఉన్న ఏరియాలో వెలుతురు లేక‌పోవ‌డంతో.. ఆ షాపు వ‌ద్ద ఉన్న బ‌ల్బ్‌ను తీసి అక్క‌డ పెట్టాన‌ని తెలిపాడు. దీనిపై శాఖాప‌రమైన విచార‌ణ‌కు పోలీసులు ఆదేశించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Updated On 17 Oct 2022 3:57 AM GMT
subbareddy

subbareddy

Next Story