Onions | విధాత: ప్రజలకు, వస్తువులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. విధి నిర్వహణలో నిజాయితీగా ఉండాల్సింది పోయి.. ఉల్లిగడ్డలు దొంగతనం చేశాడు ఓ పోలీసు కానిస్టేబుల్. ఈ ఘటన అసోంలోని దుబ్రి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. దుబ్రి పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసు పెట్రోలింగ్‌లో భాగంగా శివేశ్ సేన్ గుప్తా(50) వీధుల్లో తిరుగుతున్నాడు. అయితే ఓ రోడ్డు పక్కన పార్కు చేసిన కారులో ఉన్న ఉల్లిగడ్డల సంచులను గమనించాడు కానిస్టేబుల్. ఏ […]

Onions |
విధాత: ప్రజలకు, వస్తువులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. విధి నిర్వహణలో నిజాయితీగా ఉండాల్సింది పోయి.. ఉల్లిగడ్డలు దొంగతనం చేశాడు ఓ పోలీసు కానిస్టేబుల్. ఈ ఘటన అసోంలోని దుబ్రి జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. దుబ్రి పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసు పెట్రోలింగ్‌లో భాగంగా శివేశ్ సేన్ గుప్తా(50) వీధుల్లో తిరుగుతున్నాడు. అయితే ఓ రోడ్డు పక్కన పార్కు చేసిన కారులో ఉన్న ఉల్లిగడ్డల సంచులను గమనించాడు కానిస్టేబుల్. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఉల్లిగడ్డల బ్యాగును దొంగిలించాడు. ఈ దృశ్యాలన్ని అక్కడున్న గోదాం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
మరుసటి రోజు ఉదయం గోదాం యజమానులు ముబారక్ హుస్సేన్, మైనల్ హక్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, కానిస్టేబుల్ ఉల్లిగడ్డలను దొంగతనం చేసినట్లు తేలింది. దీంతో ఆ ఫుటేజీని పోలీసులకు సమర్పించారు. అనంతరం పుటేజీ ఆధారంగా కానిస్టేబుల్ గుప్తాపై అరెస్టు చేశారు. దుబ్రి సదర్ పోలీసు స్టేషన్‌లో గుప్తాను పోలీసులు విచారిస్తున్నారు.
ప్రస్తుతం అసోంలో కిలో ఉల్లిగడ్డ ధర రూ. 50గా ఉంది. అయితే గుప్తా ఈ దొంగతనం ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చు అని అధికారులు భావిస్తున్నారు. ఉదయం 3 గంటల సమయంలో చోరీ జరిగినట్లు రికార్డు అయింది. గోదాం వద్ద ఎవరూ లేకపోయేసరికి కారులో ఉన్న ఉల్లిగడ్డలను దొంగతనం చేసి ఉండొచ్చు అని పేర్కొన్నారు
