విధాత‌: పవన్ కళ్యాణ్ తో పయనం అంటే కుక్క తోకతో గోదారి ఈదినట్లే.. ఆయన ఎటు వెళ్తారో.. ఎటు నడుస్తారో తెలీదు.. ఏ పూటకు ఏ స్టాండ్ తీసుకుంటారో ఆయనకే తెలీదు. ప్రస్తుతానికి అలా నడుస్తోంది అంతే… అందుకే ఇక ఆయనతో పయనం కష్టం ఈసారి ఒంటరిగా.. అంటే స్వతంత్రంగా పోటీ చేస్తాను అంటున్నారు మాజీ సీబీఐ జెడి లక్ష్మీనారాయణ. గతంలో అంటే 2019 ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ దాదాపు […]

విధాత‌: పవన్ కళ్యాణ్ తో పయనం అంటే కుక్క తోకతో గోదారి ఈదినట్లే.. ఆయన ఎటు వెళ్తారో.. ఎటు నడుస్తారో తెలీదు.. ఏ పూటకు ఏ స్టాండ్ తీసుకుంటారో ఆయనకే తెలీదు. ప్రస్తుతానికి అలా నడుస్తోంది అంతే… అందుకే ఇక ఆయనతో పయనం కష్టం ఈసారి ఒంటరిగా.. అంటే స్వతంత్రంగా పోటీ చేస్తాను అంటున్నారు మాజీ సీబీఐ జెడి లక్ష్మీనారాయణ.

గతంలో అంటే 2019 ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ దాదాపు 2.88 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. కానీ ఆ తరువాత జనసేనతో పెద్దగా టచ్‌లో లేని జేడీ ఇప్పుడు సొంతంగా.. అంటే స్వ‌తంత్ర‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని అంటున్నారు.

ప్రస్తుతం జెడి విశాఖలో బేస్ ఏర్పాటు చేసుకుని అక్కడే జేడీ ఫౌండేషన్ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి దాని ద్వారానే తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. జేడీ భావజాలం వేరుగా ఉంటుంది. అది ట్రెడిషనల్ పార్టీలకు మింగుడుపడదు. ఆయన ప్రజలకే అధికారం అంటారు. రాజ్యాంగపరమైన మార్పులు కావాలని డిమాండ్ చేస్తారు.

అవినీతి వ్యతిరేక పాలన కోరుతారు. ప్రజా ప్రతినిధులు కూడా అధికారుల‌ మాదిరిగా జనాలకు తప్పనిసరిగా జవాబుదారులు కావాలంటారు. ఇక రాజకీయాల్లోకి వచ్చాక పూర్తి స్థాయిలో దానికే అంకితమై పనిచేయాలని ఆయన కోరుకుంటారు. జేడీ ఆలోచనలకు ఏ రాజకీయ పార్టీతో పొసగదని అంటున్నారు. ఆయన సైతం యువతను ఎక్కువగా దృష్టిలో ఉంచుకుని ప్రసంగాలు చేస్తూ వచ్చారు.

స్టూడెంట్స్‌,యువతలోసామాజిక చైతన్యం తెచ్చేలా ప్రసంగాలు చేస్తూ వస్తున్నారు. ప్రజలలో ప్రశ్నించే తత్వం రావాలని వారు తాము ఓట్లేసి గెలిపించిన నేతలను నిలదీయాలని కోరుకుంటారు. ఎలాగూ జనసేనకు విశాఖలో ఇప్పటికి అయితే గట్టి ఎంపీ క్యాండిడేట్ లేరు.. కాబట్టి మళ్ళీ ఈయన పోటీ చేస్తాను అంటే పవన్ కళ్యాణ్ కాదనే పరిస్థితి ఉండదు. కానీ ఆయన మాత్రం సింగిల్ గానే వస్తాను అంటున్నారు.

ఈమేరకు జేడీ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ జగన్ మురారి తెలియచేశారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానే జేడీ పోటీకి దిగుతారు అని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే జేడీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద హై కోర్టులో పోరాటం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తప్పు పడుతున్నారు.

అలాగే ప్రత్యేక హోదా వంటివి ఇవ్వకపోవడం మీద కూడా ఆయన అప్పట్లో కామెంట్స్ చేశారు. అయితే ఇంకా ఏడాది టైం ఉన్నందున ఈలోపు ఏమైనా మార్పులు ఉండొచ్చేమో అని అంద‌రూ అనుకుంటున్నారు.

Updated On 27 Dec 2022 4:37 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story