Agra | ఎందుకంటే.. ఎక్కడంటే.. విధాత: పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్ను గ్రామస్థులు విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. ఓ మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించిన ఎస్సైని గ్రామస్థులు పట్టుకొని బట్టలు ఊడదీసి, స్తంభానికి కట్టేసి చావ బాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసు అధికారిపై దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఆరా తీసిన ఆగ్రా పోలీస్ కమిషనర్.. వెంటనే […]

Agra |
- ఎందుకంటే.. ఎక్కడంటే..
విధాత: పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్ను గ్రామస్థులు విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. ఓ మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించిన ఎస్సైని గ్రామస్థులు పట్టుకొని బట్టలు ఊడదీసి, స్తంభానికి కట్టేసి చావ బాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఆదివారం చోటుచేసుకున్నది.
పోలీసు అధికారిపై దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఆరా తీసిన ఆగ్రా పోలీస్ కమిషనర్.. వెంటనే పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. అతడిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. ఘటనలో పాల్గొన్న మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సబ్ ఇన్‌స్పెక్టర్‌పై లైంగికదాడి కేసు కూడా నమోదు చేశారు.
Agra | SIని స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామస్థులుhttps://t.co/0Uhl2fP3vJ
UP Agra police sub inspector Sandeep Kumar was tied to a pole and beaten after he was allegedly found with a woman in compromising position in the village within Barhan PS limits. #viralvideo #up #Agra pic.twitter.com/St7K8uTMh0— vidhaathanews (@vidhaathanews) September 19, 2023
సబ్ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు సోమవారం నిరసనకు దిగారు. రెండేండ్ల క్రితమే పోలీసుశాఖలో చేరిన పోలీసు అధికారి సందీప్ కుమార్ ఆరోపణలను ఖండించారు. గ్రామస్థులు తనపై దాడి చేసి కొట్టినప్పుడు విచారణ కోసం ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.