విధాత: జీరో కోవిడ్ నినాదంతో చైనా క‌ఠిన చ‌ర్య‌ల‌తో అనేక న‌గ‌రాల్లో లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. వారాలు, నెల‌ల త‌ర‌బ‌డి లాక్‌డౌన్ల‌లో ఉండాల్సిన స్థితిలో ఈ మ‌ధ్య‌నే ఓ ఇంట్లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదం కార‌ణంగా 11 మంది పౌరులు చ‌నిపోయారు. దీంతో ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం అవుతున్నాయి. లాక్‌డౌన్‌ను నిర‌సిస్తూ ప్ర‌జ‌లు రోడ్డెక్కుతున్నారు. అతి పెద్ద న‌గ‌రాలైన బీజింగ్‌, షాంఘై, గువాంగ్‌ఝ‌వాల్లో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్నారు. నిర‌స‌న‌ల్లో భాగంగా […]

విధాత: జీరో కోవిడ్ నినాదంతో చైనా క‌ఠిన చ‌ర్య‌ల‌తో అనేక న‌గ‌రాల్లో లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. వారాలు, నెల‌ల త‌ర‌బ‌డి లాక్‌డౌన్ల‌లో ఉండాల్సిన స్థితిలో ఈ మ‌ధ్య‌నే ఓ ఇంట్లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదం కార‌ణంగా 11 మంది పౌరులు చ‌నిపోయారు. దీంతో ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం అవుతున్నాయి.

లాక్‌డౌన్‌ను నిర‌సిస్తూ ప్ర‌జ‌లు రోడ్డెక్కుతున్నారు. అతి పెద్ద న‌గ‌రాలైన బీజింగ్‌, షాంఘై, గువాంగ్‌ఝ‌వాల్లో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్నారు. నిర‌స‌న‌ల్లో భాగంగా విద్యార్థులు తెల్ల కాగితం ఉద్య‌మం చేప‌ట్ట‌ని విష‌యం తెలిసిందే.

నిర‌స‌న‌లు తీవ్ర‌మ‌వుతుండ‌డంతో చేసేది లేక‌ చైనా ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేసిన‌ట్లు క‌నిపిస్తున్న‌ది. పాజిటివ్ రేట్ త‌క్కువ‌గా న‌మోదు అవుతుండ‌టంతో లాక్‌డౌన్ల‌ను కొన‌సాగించ‌ ద‌ల్చుకోలేద‌ని అధికారులు ప్ర‌క‌టిస్తున్నారు. కానీ ప్ర‌జా వ్య‌తిరేక‌తే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Updated On 2 Dec 2022 2:03 PM GMT
krs

krs

Next Story