Saturday, April 1, 2023
More
    HomelatestCorruption। క్యాన్సర్‌లా పెరిగిపోతున్న అవినీతి.. దురాశే అందుకు కారణం: సుప్రీం కోర్టు

    Corruption। క్యాన్సర్‌లా పెరిగిపోతున్న అవినీతి.. దురాశే అందుకు కారణం: సుప్రీం కోర్టు

    corruption like cancer, Supreme Court

    •  కేసు విచారణలో సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
    • నైతిక విలువలు వేగంగా పతమవుతున్నాయని ఆవేద‌న‌

    దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతిపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవినీతి.. క్యాన్సర్‌లా (corruption Like Cancer) విస్తరిస్తున్నదని, సంపద పట్ల అంతులేని దురాశే అందుకు కారణమని వ్యాఖ్యానించింది. అవినీతిని న్యాయస్థానాలు సహించవద్దని, అవినీతికి పాల్పడేవారి పట్ల కఠినంగా (Zero Tolerance) వ్యవహరించాలని సూచించింది. ఈ విషయంలో దేశ ప్రజలకు కోర్టులు బద్ధులై ఉండాలని పేర్కొన్నది.

    విధాత: సంపదను సమానంగా పంపిణీ చేసేలా దేశ ప్రజలకు సామాజిక న్యాయం అందించాలనే రాజ్యాంగ పీఠిక హామీల (Preambular Promise” of the Constitution) సాధనకు అవినీతి (Corruption) అనేది అతి పెద్ద అడ్డంకిగా తయారైందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టారని ఛత్తీస్‌గఢ్‌ మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అమన్‌సింగ్‌, ఆయన భార్యపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్‌ రవీంద్రభట్‌ (Justice S Ravindra Bhat), జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా (Justice Dipankar Datta) లతో కూడిన సుప్రీం కోర్టు (Supreme Court) ధర్మాసనం పక్కన పెడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.

    అవినీతి జీవితంలో ఒక భాగమని వ్యాఖ్య

    దేశ సంపద ప్రజలకు సమానంగా పంపిణీ కావాలన్న రాజ్యాంగ పీఠిక ఉద్దేశాలు అమలు చేయడం ఇంకా నెరవేరని కలలానే (Distant Dream) ఉన్నదని పేర్కొన్నది. ఇదే ప్రధానం కాకపోయినా.. ఈ రంగంలో ప్రగతి సాధించడానికి ఒక కీలక అడ్డంకిగా అవినీతి తయారైందనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించింది.

    అవినీతి అనే జబ్బు జీవితంలో ప్రతి దశలోనూ వ్యాపించిందని పేర్కొన్నది. దురదృష్టవశాత్తూ బాధ్యతాయుతమైన పౌరులు కూడా అవినీతి జీవితంలో ఒక భాగమని వ్యాఖ్యానించడం విచారకరమని పేర్కొన్నది. రాజ్యాంగ కర్తల (Constitution) మహోన్నత ఆశయాలు నశించిపోతున్నాయని, సమాజంలో నైతిక విలువలు వేగంగా పతమవుతున్నాయని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.

    ఏడు పాపాల్లో దురాశ కూడా ఒకటని..

    అవినీతి ఎందుకు పెరిగిపోతున్నదనే విషయంలో పెద్ద చర్చ అవసరం లేదన్న ధర్మాసనం.. దురాశే (Greed) దీనికి కారణమని వ్యాఖ్యానించింది. హిందూయిజం (Hinduism) పేర్కొన్న ఏడు పాపాల్లో దురాశ కూడా ఒకటని గుర్తు చేసింది. ఇప్పడు అదే అన్నింటినీ శాసిస్తున్నదని విచారం వ్యక్తం చేసింది. వాస్తవానికి సంపద పట్ల అంతులేని దురాశే అవినీతి క్యాన్సర్‌లా పెచ్చరిల్లడానికి కారణమని స్పష్టం చేసింది.

    అవినీతి విజయం సాధిస్తే..

    చట్టాలు చేసేవారిని సైతం మాయ చేయడంలో అవినీతి విజయం సాధిస్తే దొరికిపోతామన్న భయం కూడా వారికి ఉండదని వ్యాఖ్యానించింది. అలాంటివారు నియమ నిబంధనలనేవి సాధారణ ప్రజలకేనని, తమకు కాదనే విశ్వాసంతో ఉంటారని కోర్టు వ్యాఖ్యానించింది. పట్టుబడటమే పాపం అన్నట్టు ఉంటారని పేర్కొన్నది.

    కఠిన శిక్షలు.. అవినీతి నిరోధక చట్టం కర్తవ్యమని..

    కుంభకోణాలు సర్వసాధారణమైపోయాయన్న కోర్టు.. వాటిపై జరిగే విచారణలు, దర్యాప్తులు మరింత కలవరపెడుతుంటాయని వ్యాఖ్యానించింది. ఇటువంటివి కొనసాగేందుకు అనుమతి ఇద్దామా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

    అవినీతికి పాల్పడే ప్రజా సేవకులను పట్టుకోవడం, వారిని కఠినంగా శిక్షించడం అనేది అవినీతి నిరోధక చట్టం (Prevention of Corruption Act) కర్తవ్యమని తేల్చి చెప్పింది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు రాజ్యాంగ విలువలు కాపాడే విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలని కోరింది.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular