HomelatestMedak | కుటుంబ కలహాలతో బావిలో దూకిన‌ భార్య భర్తలు

Medak | కుటుంబ కలహాలతో బావిలో దూకిన‌ భార్య భర్తలు

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో విషాదం ఘ‌ట‌న చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా పాపన్న పేట మండల పరిధి నార్సింగి గ్రామ శివారులో గురువారం ఉదయం జ‌రిగింది. స్థానికులు పోలీసుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

నార్శింగి గ్రామానికి చెందిన దారబోయిన నగేష్ (36) స్వరూప (29) దంపతులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో శివారులో ఉన్న ఓ భూస్వామి వద్ద నెల వారి జీతం మాట్లాడుకొని పని చేయసాగారు.

 

అయితే గత రెండు రోజులుగా ఇరువురి మధ్య గొడవలు జరిగినట్లు తెలిపారు. బుదవారం సాయంత్రం ఇరువు కలిసి పాడి అవులకు మేత వేసేందుకు వెళ్ళి అక్కడే గొడవ పడి క్షణికావేశంలో స్వపూర బావిలో దుకడంతో ఈ విషయం గమనించిన నగేష్ భార్యను కాపాడేందుకు బాయిలోకి దుకడంతో ప్రాణభయంతో భార్య భర్తను నీటిలో గట్టీగా పట్టుకోవడంతో ఇరువురు నీటమునిగి మృతి చెందినట్లు తెలిపారు.

కాగా.. ఎంతకు ఇరువురు ఇంటికి రాకపోవంతో మరుసటి రోజు వెళ్ళి చూడగా ఇరువురు బావిలోని నీటిపై ఇరువురి మృతదేహాలు తేలియాడడం గుర్తించిన కుటుంబీకులు వెంటనే పాపన్నపేట పోలీసులకు సమాచారం అందిచారు.

పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి పంచనామా నిర్వహించి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ నారాయణ్ కుమార్ తెలిపారు.

 

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular