OYO Rooms | విధాత: మీరు ఆన్ లైన్‌లో ఓయో రూమ్‌ను బుక్ చేసుకుంటున్నారా..? లేదా నేరుగా అక్కడికి వెళ్లి రూమ్ తీసుకుంటున్నారా? అయితే జర జాగ్రత్త.. ఓయో రూముల్లో మనకు తెలియకుండానే సీక్రెట్ కెమెరాలు ఉంచుతున్నారు. దంపతుల నగ్న చిత్రాలు ఆ కెమెరాల్లో రికార్డు అవుతున్నాయి. ఆ తర్వాత చిత్రాలను చూపించి, సదరు దంపతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో వెలుగు చూసింది. ఓ ఇద్దరు దంపతులు ఇటీవలే ఓయో […]

OYO Rooms | విధాత: మీరు ఆన్ లైన్‌లో ఓయో రూమ్‌ను బుక్ చేసుకుంటున్నారా..? లేదా నేరుగా అక్కడికి వెళ్లి రూమ్ తీసుకుంటున్నారా? అయితే జర జాగ్రత్త.. ఓయో రూముల్లో మనకు తెలియకుండానే సీక్రెట్ కెమెరాలు ఉంచుతున్నారు. దంపతుల నగ్న చిత్రాలు ఆ కెమెరాల్లో రికార్డు అవుతున్నాయి. ఆ తర్వాత చిత్రాలను చూపించి, సదరు దంపతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో వెలుగు చూసింది.


ఓ ఇద్దరు దంపతులు ఇటీవలే ఓయో రూమ్ కు వెళ్లారు. వారిద్దరూ శారీరకంగా కలుసుకున్నారు. ఈ ద‌ృశ్యాలు అక్కడున్న సీక్రెట్ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని దంపతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలను బయట పెడుతామని ఆ దుండగులు బెదిరింపులకు గురి చేస్తున్నారు. చేసేదేమీ లేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


అయితే ఓయో రూముల్లో సీక్రెట్ కెమెరాలు ఉంచడంలో.. యాజమాన్యం పాత్ర లేదని పోలీసులు తేల్చారు. కొందరు దుండగులు ఓయో గదులను బుక్ చేసుకుని వస్తున్నారు. ఇక యాజమాన్యానికి తెలియకుండా.. ఆ గదుల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చుతున్నారు. మళ్లీ కొద్ది రోజులకు అదే రూమ్ బుక్ చేసుకుని, కెమెరాలను తీసుకెళ్తున్నారు.

ఆ తర్వాత దంపతుల చిత్రాలను ఆధారం చేసుకుని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో విష్ణు సింగ్, అబ్దుల్ వహవ్, పంకజ్ కుమార్, అనురాగ్ కుమార్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి గ్యాంగ్ లు చాలా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.

Updated On 25 Oct 2022 6:14 AM GMT
subbareddy

subbareddy

Next Story