- చిటఫండ్ సంస్థల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు
- నిర్థిష్ట సమయంలో ఖాతాదారులకు చెల్లింపులు జరపాలి
- పెరిగిన ఫిర్యాదులపై స్పందన
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: చిట్ ఫండ్(Chit Fund) ఖాతాదారులకు చేయాల్సిన చెల్లింపులు ముందుగా సూచించిన సమయంలోనే చెల్లించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్(Commissioner of Police)ఏ.వి. రంగనాథ్(AV Ranganath) చిట్ ఫండ్ సంస్థల యాజమాన్యానికి సూచించారు. చిట్ ఫండ్ కంపెనీల ఆగడాలపై రోజు, రోజుకి పోలీస్ కమిషనర్‌కు ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో, ఈ ఫిర్యాదులపై సీపీ స్పందించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చిటఫండ్ సంస్థల యాజమాన్యంతో గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
చెల్లింపుల పెండింగ్ పైన దృష్టి
చిట్ ఫండ్ సంస్థలు ఎంతమంది ఖాతాదారులకు చెల్లింపులు చేయాల్సిన వివరాలు, నమోదయిన కేసుల్లో ఎంత మంది బాధితులకు చెల్లింపులు జరిపాయో, చెల్లింపులు చేయాల్సిన సంస్థల వివరాలు తెలుసుకున్నారు.
ఖాతాదారుల సమస్యలు పరిష్కరించాలి
అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎంత మంది ఖాతాదారులకు ఎంత మొత్తంలో చెల్లించాల్సి వుంది, ఖాతాదారుల నుండి రావాల్సిన మొత్తానికి సంబంధించి చిట్ ఫండ్ కంపెనీల వారిగా వివరాలను సేకరించి పోలీస్ అధికారులకు అందజేయాలన్నారు. బాధితులకు న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వివరాలను కమిషనరేట్ వెబ్ సైట్లో పెడుతామన్నారు. సమావేశంలో డిసిపిలు యం.ఏ. బారీ, మురళీధర్, అదనపు డిసిపి పుష్పా రెడ్డి చిట్స్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి, ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.